అంతర్జాతీయం

ఆదేశాలు అమలు చేయనందుకు అటార్నీపై ట్రంప్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 31: ముస్లిం దేశాలకు చెందినవారిని దేశంలోకి అనుమతించకూడదంటూ తాను జారీచేసిన ఉత్తర్వును అమలుచేయనందుకు ఇద్దరు అటార్నీలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటువేశారు. నిర్ణయంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత చోటుచేసుకుంటున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే అటార్నీ జనరల్ శాలీ యేట్స్ సహా ఇద్దరిని ట్రంప్ తొలగించారు. ఈ మేరకు వైట్‌హౌస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయపరంగా సమర్థించవద్దంటూ జస్టిస్ విభాగానికి చెందిన లాయర్లను యేట్స్ కోరడమే ఆమెపై వేటుపడటానికి కారణమైంది. ట్రంప్ జారీచేసిన ఉత్తర్వును చట్టబద్ధమైనదిగా తాను భావించడం లేదని కూడా జస్టిస్ విభాగానికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. యేట్స్‌ను ఒబామా ప్రభుత్వమే నియమించిన విషయం గమనార్హం. అక్రమ వలసలు జరుగుతున్న వాటిని యేట్స్ సమర్థిస్తున్నారని, అందుకే ఆమెపై చర్య తీసుకున్నామని వైట్‌హౌస్ తెలిపింది. ఆమె స్థానే డానా బోంటేను కొత్త అటార్నీ జనరల్‌గా నియమించినట్లు తెలిపింది. ట్రంప్ ఆదేశాన్ని శిరసావహిస్తానని కొత్త అటార్నీ ప్రకటించారు.

చిత్రం..శాలీ యేట్స్