అంతర్జాతీయం

మా దేశానికి రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువైట్ సిటీ, ఫిబ్రవరి 2:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాలో కువైట్ కూడా ఐదు ముస్లిం మెజార్టీ దేశాల పౌరులకు వీసాలను నిలిపివేసింది. వీటిలో పాకిస్తాన్, సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్, ఇరాన్‌లు ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎవరికీ వీసాలు ఇచ్చే ప్రసక్తి లేదని పేర్కొన్న కువైట్ ప్రభుత్వం ఈ నిషేధం విధించక పోతే ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేసింది. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ నిషేధం విధించడానికి ముందే సిరియా దేశస్తులు తమ దేశంలోకి రాకూడదంటూ కువైట్ ఆంక్షలు విధించింది. 2011 మొత్తం సిరియా పౌరులందరి వీసాలనూ నిలిపివేసి సంచలనం సృష్టించింది. గల్ఫ్ సహకార మండలిలో సభ్యత్వం కలిగిన కువైట్ జిసిసి-ఇరాన్ మధ్య జరుగుతున్న వివాదంలో నలిగిపోతోంది. జిసిసి భద్రతకు అమెరికా 1990 నుంచి బాసటగా నిలుస్తోంది.