అంతర్జాతీయం

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ముస్లిం దేశాల నుంచి ప్రజలు అమెరికాలో అడుగు పెట్టకుండా విధించిన ఆంక్షలను వెంటనే అమలులోకి వచ్చేలా చూడాలని, ఆ ఆంక్షల అమలును నిలిపివేస్తూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ట్రంప్ పాలనా యంత్రాంగం చేసిన అభ్యర్థనను అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు శనివారం తోసిపుచ్చింది. దీంతో ముస్లింలు అధిక సంఖ్యలో గల ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, సోమాలియా, లిబియా, యెమెన్‌లకు చెందిన ప్రజలు అమెరికాకు రాకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. అప్పీలును లోతుగా విచారించకుండా తక్షణమే దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ అప్పీలుదారు చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు పేర్కొంది.
అమెరికాలోకి ప్రవేశంపై విధించిన ఆంక్షలను నిలిపివేస్తూ ఫెడరల్ న్యాయమూర్తి శుక్రవారం జారీ చేసిన ఆదేశాలపై తాను నిర్ణయం తీసుకోవడానికి ముందు తమ వాదనను సమర్థించే చట్టపరమైన అంశాలను రేపటిలోగా సమర్పించాలని ఇరు పక్షాలను ఫెడరల్ అప్పీళ్ల కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాలు చేస్తున్నవారు అప్పీలుకు సమాధానం ఇవ్వాలని, అమెరికా న్యాయశాఖ కౌంటర్ రెస్పాన్స్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.

చిత్రం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఎక్కువ కావడంతో
లాస్ ఏంజిలిస్ ఎయర్ పోర్టులో మోహరించిన భద్రతా సిబ్బంది