అంతర్జాతీయం

ఆఫ్గాన్ సుప్రీం కోర్టు వద్ద ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఫిబ్రవరి 7: ఆఫ్గనిస్తాన్ సుప్రీం కోర్టు వద్ద మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారు. మరో 41 మంది గాయపడ్డారు. పనివేళలు పూర్తయిన తరువాత ఇళ్లకు వెళ్లేందుకు కోర్టు సిబ్బంది ప్రాంగణంలో బస్సు ఎక్కుతున్న సమయంలో నడిచివచ్చిన ఆత్మహుతి బాంబర్ విస్ఫోటనం చెందాడు. ఈ సంఘన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, అమెరికా ఎంబసీ కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. కోర్టు సిబ్బంది బంధువులు ఆ ప్రాంతానికి చేరుకుని తమ వారికోసం వెతుకులాట మొదలెట్టారు. స్వల్ప వ్యవధిలోనే అంబులెన్స్‌లను, అగ్నిమాపక వాహనాలు ఆ ప్రాంతానికి తరలించారు. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తరువాత శాంతి భద్రతల పరిస్థితి మరింతగా క్షీణించిందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. గత నెలలో పార్లమెంట్ సమీపంలోనే తాలిబన్ మిలిటెంట్లు బాంబు దాడులు జరపడం, తాజాగా జరిగిన ఆత్మాహుతి దాడి మళ్లీ మిలిటెంట్ల చేతుల్లోకి ఆఫ్గనిస్తాన్ చేరుకుంటుందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రం..అఫ్గాన్ సుప్రీం కోర్టు వద్ద జరిగిన దాడి అనంతరం అప్రమత్తమైన భద్రతా దళాలు