అంతర్జాతీయం

భారతీయులకు ఇస్రో గర్వకారణమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 16: ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇస్రో భారతీయులందరినీ గర్వపడేలా చేసిందని చైనా అధికారిక మీడియా పేర్కొంది. భారత అంతరిక్ష కార్యక్రమం ఇతర దేశాల ఆలోచనలకు ఆహారాన్ని అందించిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. మార్స్‌పైకి అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాన్ని పంపించిన మంగళ్‌యాన్ కార్యక్రమాన్ని గతంలో తీవ్రంగా విమర్శించిన ఇదే పత్రిక ఇప్పుడుకూడా ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు ఇది చాలా పరిమితమైనదనే వ్యాఖ్యానించింది. స్పేస్ టెక్నాలజీ రేసులో ఒకసారి అధిక సంఖ్యలో ఉపగ్రహాలు పంపించటం విజయమే కానీ, ఇది పరిమితమైనదే. అయితే ప్రస్తుత స్పేస్ టెక్నాలజీ లెవల్స్‌కు తక్కువ పెట్టుబడితో భారత్ ఒకరకంగా కఠినమైన విజయానే్న సాధించిందని పేర్కొంది.