అంతర్జాతీయం

‘ట్రంప్ పర్యటన’పై బ్రిటన్ పార్లమెంటులో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 21: బ్రిటన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న వేలాది మంది ఆందోళనకారులు మంగళవారం బ్రిటన్ పార్లమెంటు వెలుపల ప్రదర్శన నిర్వహించారు. బ్రిటన్ తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ, ఈ ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న ఆన్‌లైన్ పిటిషన్‌పై ఒకవైపు పార్లమెంటు లోపల ఎంపీలు చర్చిస్తుండగా, బయట వేలాది మంది ఆందోళనకారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఈ ఆన్‌లైన్ పిటిషన్‌పై 1.8 మిలియన్ మంది సంతకాలు చేశారు. ట్రంప్‌ను బ్రిటన్‌కు రానివ్వొద్దని పార్లమెంటు స్క్వేర్ వద్ద ఆందోళనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే బ్రిటన్.. ట్రంప్‌ను ఆహ్వానించడాన్ని సమర్థిస్తున్న మరో కౌంటర్ పిటిషన్ గురించి కూడా ఎంపీలు చర్చించారు. ఈ కౌంటర్ పిటిషన్‌పై 3లక్షల మంది ప్రజలు సంతకాలు చేశారు. ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఈ సంవత్సరం జనవరిలో సమావేశమయ్యారు. ట్రంప్‌తో భేటీ అయిన తొలి విదేశీ నేత ఆమెనే. ఈ సందర్భంగా ఆమె బ్రిటన్‌లో పర్యటించాల్సిందిగా ట్రంప్‌ను ఆహ్వానించారు. ఇది జరిగిన కొన్ని గంటల తరువాతే ట్రంప్ ముస్లింల జనాభా ఎక్కువగా గల ఏడు దేశాల నుంచి వలసలపై ఆంక్షలు విధించారు. కాగా, బ్రిటన్ పార్లమెంటులో జరిగిన చర్చలో లేబర్ పార్టీకి చెందిన ఎంపి డేవిడ్ లామీ మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య ఒప్పందంకోసం బ్రిటన్ తహతహలాడుతోందని, అందుకే ట్రంప్‌ను ఆహ్వానించిందని విమర్శించారు.