అంతర్జాతీయం

సిరియాలో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, ఫిబ్రవరి 25: సిరియాలో జనసమ్మర్థం కలిగిన రెండు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 42 మంది మరణించారు. మరణించినవారిలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు అత్యంత సన్నిహితుడైన జనరల్ హసన్ దాబూల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జనరల్ హసన్ దేశంలోని టాప్ ఇంటిలిజెన్స్ అధికారి కాగా ఆయన జెనీవాలో జరిగిన శాంతి చర్చల్లోనూ పాల్గొన్నారు. కేవలం హసన్‌ను టార్గెట్‌గా చేసుకునే ఒక ఆత్మాహుతి దాడి జరిగిందని, దాడికి తామే బాధ్యులమని అల్‌ఖైదా నుంచి రూపాంతరం చెందిన ఫతే అల్ షామ్ ఫ్రంట్ ప్రకటించిందని పోలీసులు తెలిపారు. ఘౌటా-మహట్టా సరిహద్దులోని హోమ్ పట్టణంలో జరిగిన ఈ పేలుడులో దాదాపు 30 మంది చనిపోగా, 24 మంది గాయపడ్డారని ప్రావిన్స్ గవర్నర్ తలాల్ బజారి వెల్లడించారు.
దాడికి ముందు ఇంటిలిజెన్స్ అధికారులపై కాల్పులు కూడా జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు మిలిటెంట్లు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. హోమ్స్ పట్టణం తిరుగుబాటుదారుల అధీనంనుంచి 2014లో ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చింది. అప్పటినుంచీ కూడా ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సిరియాలో గత ఆరేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది మరణించినట్లు తెలుస్తోంది.

చిత్రం..సిరియాలో ఆత్మాహుతి దాడి జరిగిన అనంతరం ఏర్పడిన భీతావహ పరిస్థితి