అంతర్జాతీయం

మేమూ ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికోసిటీ, ఫిబ్రవరి 26: అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై పన్ను వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు నిజమైన పక్షంలో తామూ ప్రతి చర్యకు పూనుకుంటామని మెక్సికో విదేశాంగ మంత్రి లూరుూస్ విడెగారే పేర్కొన్నారు. ట్రంప్ బెదిరింపులకు మెక్సికో ప్రభుత్వం తగిన రీతిలో ప్రతిస్పందిస్తుందని లూరుూస్ అన్నారు. అయితే అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై సాధారణ పన్ను విధించబోమని, అలా చేస్తే మెక్సికో వినియోగదారుడు ఇబ్బంది పడతాడని, కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రం పన్ను వేస్తామన్నారు. సుమారు రెండు వేల మైళ్ల సరిహద్దు అమెరికా-మెక్సికోల మధ్య ఉంది. ఈ మొత్తం సరిహద్దులో గోడ నిర్మించాలని ట్రంప్ భావిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ వాగ్దానాన్ని పదే పదే చేస్తూ వచ్చారు. ఒక వేళ ట్రంప్ తాను అన్న పనే చేస్తే దాని ప్రభావం అమెరికా వాసులపైనే పడుతుందని లూయిస్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కార్లు, మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని లూరుూస్ వ్యాఖ్యానించారు.