అంతర్జాతీయం

ఉద్యోగులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు మధ్య జరుగుతున్న వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం తరచుగా మీడియాకు లీక్ అవుతుండటంతో అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపి వారి ఫోన్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. వార్తా కథనాలకోసం అభిజ్ఞ వర్గాలను ఉపయోగించుకుంటున్నందుకు, తన ప్రభుత్వంలోని వ్యక్తులు అనధికారికంగా సమాచారాన్ని పంచుకోవడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయని ‘పొలిటికో’ వార్తా సంస్థ పేర్కొంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ గత వారం తమ విభాగానికి చెందిన డజను మంది సిబ్బందితో నిర్వహించ తలపెట్టిన సమావేశ వివరాలు ముందుగానే లీక్ అయినట్లు ఆయన (స్పైసర్) దృష్టికి వచ్చిందని, దీంతో ఆయన ఆ తర్వాత తన కార్యాలయంలో మరోసారి ఈ సమావేశాన్ని నిర్వహించి వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలకు సంబంధించిన వివరాలు ముందుగానే మీడియాకు లీక్ అవుతుండటం పట్ల అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారని, అందుకే వైట్ హౌస్ ఉద్యోగులపై నిఘా పెట్టి వారి ఫోన్లను తనిఖీ చేస్తున్నారని ‘పొలిటికో’ వెల్లడించింది.