అంతర్జాతీయం

భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సర్కారు సానుకూలమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 4: భారత్, అమెరికా సంబంధాల పట్ల ట్రంప్ పాలనా యంత్రాంగం చాలా సానుకూల దృక్పథంతో ఉందని, ఇరు దేశాల బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తెలిపారు. అమెరికా సీనియర్ క్యాబినెట్ సభ్యులు, ఉన్నతాధికారులతో శుక్రవారం ఇక్కడ విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన జైశంకర్ అనంతరం భారతీయ మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లగలమన్న ఆశావాద దృక్పథంతో ట్రంప్ పాలనా యంత్రాంగం ఉందన్నారు. గత ఒబామా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భారత్-అమెరికా వ్యూహాత్మక వాణిజ్య చర్చలు ఈ సంవత్సరం చివరలో జరుగుతాయని ఆయన చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ హయాంలో తొలి భారత్-అమెరికా వ్యూహాత్మక వాణిజ్య చర్చలను జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్, ఆర్థిక మంత్రి విల్బుర్ రాస్ భారత్‌కు రానున్నారని, వీరి భారత పర్యటనకు సంబంధించిన తేదీలను ఖరారు చేయడానికి కసరత్తు సాగుతోందని జైశంకర్ వెల్లడించారు. మొత్తంమీద చూసినప్పుడు ట్రంప్ పాలనా యంత్రాంగం భారత్ పట్ల, భారత్‌తో సంబంధాల పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పాలనా యంత్రాంగంలోని ఉన్నత స్థాయి నేతలు, అధికారులతో చర్చలు జరపడానికి భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టెయోటియాతో కలిసి జైశంకర్ ఇక్కడికి వచ్చారు. జైశంకర్ తన పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి టిల్లెర్సన్, ఆర్థిక మంత్రి రాస్, హోంమంత్రి జనరల్ (రిటైర్డ్) జాన్ కెల్లి, జాతీయ భద్రత సలహాదారు ఆర్ మెక్‌మాస్టర్, అధ్యక్షుడి ఉప సహాయకుడు కెన్ జుస్టర్ సహా పలువురు ఉన్నత స్థాయి నేతలతో అనేక కీలకమైన సమావేశాలు జరిపారు. జైశంకర్ నేతృత్వంలోని భారత ఉన్నత స్థాయి అధికారుల బృందం అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ శర్ణాతో కలిసి ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ ర్యాన్, సభలో మైనారిటి నాయకుడు నాన్సీ పెలోసి, సెనేట్ విదేశీ సంబంధాల కమిటి చైర్మన్ బాబ్ కోర్కర్, ప్రతినిధుల సభ విదేశీ సంబంధాల కమిటి చైర్మన్ ఎడ్ రోయ్‌స్ సహా అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఉన్నత స్థాయి నాయకులతో సమావేశమయింది.
‘్భరత్-అమెరికాల మధ్య సంబంధాలు పెంపొందడానికి అమెరికా కాంగ్రెస్ విశేషంగా మద్దతిస్తోంది. అమెరికాలో రాజకీయంగా మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో వారితో చర్చలు జరపడం ముఖ్యమని మేము భావించాం’ అని జైశంకర్ తెలిపారు. భారత్, అమెరికా సంబంధాలలో గత కొనే్నళ్లలో జరిగిన పురోగతిని తాము చర్చల సందర్భంగా ట్రంప్ పాలనా యంత్రాంగానికి వివరించామని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలతోపాటు అఫ్గానిస్తాన్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిపై టిల్లెర్సన్‌తో జైశంకర్ చర్చించారు. రాస్‌తో జరిపిన చర్చల్లో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారంపై ఎక్కువగా కేంద్రీకరించారు.

చిత్రం..జైశంకర్