అంతర్జాతీయం

న్యూజిలాండ్‌లోనూ విద్వేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, మార్చి 6: అమెరికాలోని జాత్యహంకార పెడధోరణి న్యూజిలాండ్‌కూ పాకింది. ఆక్లాండ్‌లో నరిందర్‌వీర్ సింగ్‌ను మీ దేశానికి తిరిగి వెళ్లాల్సిందిగా బెదిరించింది. ‘‘నేను కారులో వెళ్తూ షూట్ చేస్తున్నా.. అతని కారు వచ్చినప్పుడు అతనికి దారి ఇచ్చా. అతను అకస్మాత్తుగా నన్ను దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. మీ సొంత దేశానికి వెళ్లిపొండని బెదిరించాడు. ఆ కారులో ఉన్న మహిళ నాకు అసభ్యకరంగా సైగలు చేసింది. దీంతో నేను నా కారు డ్రైవర్‌కు చెప్పాను ఈ వీడియోను లైవ్‌లో అప్‌లోడ్ చేయమని.’’ అని సింగ్ వెల్లడించారు. సింగ్‌ను వేధించిన వ్యక్తి బూడిద రంగు టీషర్ట్ వేసుకుని కనిపిస్తున్నాడు. అతను సిక్కులను, పంజాబీలను కూడా విమర్శించాడని సింగ్ వివరించారు. ‘‘నాకు ఏం చేయాలో తోచలేదు. అతని దగ్గర ఆయుధం ఉందేమో నాకు తెలియదు. ఒక వేళ ఉంటే దాంతో దాడి చేయవచ్చేమో అన్న భయం వేసింది.’’ అని సింగ్ అన్నారు. గత వారం విక్రమ్‌జిత్ సింగ్ అనే వ్యక్తికి కూడా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌లో అసహనం బాగా పెరిగిపోతోందని అక్కడి వలసవాదుల సంఘం నేత అను కాలోటి అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత వివిధ దేశాల సమాజాల్లో అసహనం పెచ్చుమీరిపోయిందన్నారు.