అంతర్జాతీయం

ప్రాతినిథ్యం..అత్తెసరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 7: పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో 2016లో ఆసియాలో వెనుకబడి ఉన్న ఏకైక దేశం భారత్ ఒక్కటేనని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరడానికి, గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో సాధించిన పురోగతి వేగాన్ని అందుకోవడానికి మరిన్ని చర్యలతో పాటుగా బలమైన రాజకీయ చిత్తశుద్ధి అవసరమని ‘2016లో పార్లమెంటులో మహిళలు’ పేరిట ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) మంగళవారం విడుదల చేసిన ఓ నివేదిక పేర్కొంది. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలతో పాటుగా అన్ని చోట్లా మహిళల వాణి బలంగా వినిపించేలా చేయడానికి మరింత చురుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆ నివేదిక అభిప్రాయ పడింది. ప్రాంతాల వారీగా పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం గురించి ఆ నివేదిక వివరిస్తూ ఆసియాలో పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2016లో అరశాతం మేర పెరిగిందని తెలిపింది.
2015లో ఇది 18.8 శాతంగా ఉండగా, 2016లో 19.3 శాతానికి చేరుకుంది. ఎన్నికలు జరిగిన దాదాపు అన్ని దేశాలు- ఇరాన్, జపాన్, లావోస్, మంగోలియా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, వియత్నాం -లో ఎంతో కొంత పెరుగుదల ఉండగా, భారత్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. మన దేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను 1994లోనే ప్రవేశపెట్టారు. అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ 2008లోనే ప్రవేశపెట్టినప్పటికీ, జాతీయ స్థాయిలో మహిళలకు రిజర్వేషన్లకు కల్పించాలన్న ఉద్దేశం పార్లమెంటులో చర్చ స్థాయిలోనే ఆగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. 2016 జూన్, జులై నెలల్లో జరిగిన ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలు, ప్రభుత్వం నియామకాల కారణంగా 244 మంది సభ్యులుండే రాజ్యసభలో మహిళా సభ్యుల సంఖ్య 27కు చేరుకుంది. అయితే అంతకు ముందు జరిగిన రెన్యువల్స్‌తో పోలిస్తే మహిళల సంఖ్య 1.7 శాతం తగ్గింది. అంతకు ముందు రాజ్యసభలో మహిళా సభ్యుల ప్రాతినిధ్యం 12.8 శాతంగా ఉండగా, ఇప్పుడు 11.1 శాతానికి తగ్గిపోయింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లలో మహిళల సగటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2016లో స్వల్పంగా పెరిగినట్లు ఆ నివేదిక తెలిపింది. 2015లో ఇది 22.6 శాతంగా ఉండగా, 2016లో 23.3 శాతానికి పెరిగింది. కాగా, దశాబ్దం క్రితం ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లలో మహిళా సభ్యుల సంఖ్య 16.8 శాతంగా ఉండగా, గత పదేళ్లలో ఇది 6.5 శాతం పెరిగింది.
కాగా, 2030 నాటికల్లా స్ర్తి పురుష సమానత్వం,అన్ని స్థాయిలలో మహిళలకు పూర్తి, సమాన ప్రాతనిధ్యం ఉండేలా చూడడం అనే లక్ష్యాన్ని సాధించడానికి విధానాలు, చట్టాలను బలోపేతం చేయడానికి, అలాగే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో మహిళలు కూడా ఉండేలా చూడాలంటే పార్లమెంట్లు అత్యంత ముఖ్యమైనవని ఐపియు సెక్రటరీ జనరల్ మార్టిన్ చుంగ్‌గోంగ్ అభిప్రాయ పడ్డారు.