అంతర్జాతీయం

ట్రంప్ తాజా ఉత్తర్వుకూ చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 16: ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు, శరణార్థులు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన సరికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులకు అమెరికా కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఈ ఉత్తర్వులు అమలులోకి రావడానికి కొద్ది గంటల ముందు హవాయిలోని డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డెరిక్ వాట్సన్ ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు చట్టబద్ధంగా లేదని పేర్కొంటూ ఈ ఉత్తర్వుల అమలును నిలిపి వేశారు. ‘ప్రభుత్వం వాదన చాలా అసంబద్ధంగా ఉంది. ఒక వర్గం తప్పు చేసినందుకు అందరినీ శిక్షించడం అనేది వౌలికంగా లోపభూయిష్టమైంది’ అని న్యాయమూర్తి 43 పేజిల కోర్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ముస్లిం దేశాలయిన ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్ దేశాలకు చెందిన వారిపై 90 రోజులపాటు నిషేధం విధిస్తూ ట్రంప్ తాజాగా జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు బుధవారం అర్ధరాత్రినుంచి అమలులోకి రావలసి ఉండగా, కొన్ని గంటల ముందే జడ్జి ఈ ఉత్తర్వులను నిలిపివేయడం గమనార్హం. ఇంతకుముందు ఇరాక్‌తో కలుపుకొని ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధిస్తూ గత నెల ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులకు అమెరికాలోని పలు కోర్టుల్లో చుక్కెదురైన విషయం తెలిసిందే. కాగా, తాజా పరిణామంపై ట్రంప్ తనదైన రీతిలో తీవ్రంగా స్పందించారు. కోర్టు తీర్పు తమను బలహీనులుగా కనిపించేలా చేస్తోందన్న ఆయన ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. అంతేకాక అమెరికా న్యాయ వ్యవస్థ పరిమితికి మించి స్పందించే తీరుకు జడ్జి తీర్పు ఒక ఉదాహరణ అని కూడా ట్రంప్ అన్నారు. న్యాయమూర్తి వాట్సన్ బహుశా రాజకీయ కారణాలపై ఈ విధంగా స్పందించి ఉంటారని కూడా ఆయన అన్నారు. కాగా, కోర్టు తీర్పుపై ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పౌరహక్కుల ఉద్యమ సంఘాలు, అమెరికాలోని భారతీయ సంతతికి చెందినవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హవాయి ప్రాంతం అన్ని వర్గాలు, మతాలు, జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమని, గుడ్డిగా జారీ చేసిన ఈ తాజా ప్రయాణ నిషేధ ఉత్తర్వు అమలు కాకుండా మా అటార్నీ జనరల్ ప్రయత్నించడం సరయిన చర్యేనని అమెరికా కాంగ్రెస్‌లో హవాయికి ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు తుల్సి గబ్బర్డ్ అన్నారు.

చిత్రం..ఆండ్రూస్ ఎయర్ ఫోర్స్ బేస్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్