అంతర్జాతీయం

సైనిక చర్యకూ వెనకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, మార్చి 17: ఉత్తర కొరియానుంచి ముప్పుగనుక పెరిగినట్లయితే ఆ దేశంపై సైనిక చర్యకు సైతం వెనకాడబోమని అమెరికా నూతన విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆసియాలో పర్యటస్తున్న టిల్లర్‌సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉత్తర కొరియా పట్ల అమెరికా విధానంలో సమూల మార్పుకు ఒక సంకేతంగా భావిస్తున్నారు. ఉత్తర కొరియా గత వారం క్షిపణి పరీక్ష నిర్వహించిన తర్వాత టిల్లర్‌సన్ ఆసియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడికి రిహార్సల్‌గా ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఉత్తర కొరియా చెప్పుకొంటోంది. ఉత్తర కొరియానుంచి ఎదురయ్యే దాడులను దక్షిణ కొరియా సమర్థవంతంగా ఎదుర్కొనేలా చూడడం కోసం అమెరికా అక్కడ 28 వేలమంది సైనికులను ఉంచిన విషయం తెలిసిందే. అయితే దక్షిణ కొరియా రాజధాని ఉత్తర కొరియా శతఘ్ని దాడుల రేంజి లోపలే ఉన్న దృష్ట్యా, ఒక వేళ యుద్ధమే వస్తే భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించే అవకాశమున్నట్లు విశే్లషకులు అంటున్నారు. కాగా, మా జీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హ యాంలో ఉత్తర కొరియా పట్ల అనుసరిస్తున్న వ్యూహాత్మక సంయమనం వైఖరి ముగిసిపోయిందని టిల్లర్‌సన్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపి వేసే దాకా అమెరికా ఆ దేశంతో చర్చలు జరపకూడదనేది ఆ విధానం. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా వెలి వేయడం వల్ల ఏకాకిగా మారిన ఉత్తర కొరియాలో అంతర్గత ఒత్తిళ్లు దాని వైఖరిలో మార్పు తెస్తుందనే ఆశతో అమెరికా వేచి చూసే ధోరణిని అనుసరిస్తూ వచ్చింది. అయితే తాము ఇప్పుడు సరికొత్త దౌత్య, భద్రతా, ఆర్థికపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని, అన్ని ఆప్షన్లు పరిశీలనలో ఉన్నాయని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి యున్‌బ్యుంగ్-సేతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన టిల్లర్‌సన్ చెప్పారు.