అంతర్జాతీయం

కూచిభొట్ల గౌరవార్థం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 17: అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో మార్చి 16ను ఇకనుంచి ‘ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ డే’గా పరిగణించనున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జాతి విద్వేషంతో శే్వత జాతీయుడు జరిపిన కాల్పుల్లో మరణించిన భారతీయుడు శ్రీనివాస్ కూచిభొట్ల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాన్సాస్ గవర్నర్ శామ్ బ్రౌన్‌బ్యాక్ ప్రకటించారు. కాన్సాస్‌లోని ఓలాథే బార్‌లో గత మార్చి 16న యుఎస్ నేవీ మాజీ ఉద్యోగి ఆడమ్ పురిన్టన్ జాతి విద్వేషాగ్రహంతో జరిపిన కాల్పుల్లో భారతీయ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో భారతీయుడు అలోక్ మేడసాని తీవ్రంగా గాయపడితే, కాల్పులను అడ్డుకునేందుకు ప్రయత్నించి శే్వతజాతీయుడు ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డాడు. అది దురదృష్టకర సంఘటనగా గవర్నర్ శామ్ బ్రౌన్‌బ్యాక్ ప్రస్తావిస్తూ, కాన్సాస్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘కాన్సాస్ ఉన్నతస్థానానికి చేరుకోవడానికి భారతీయుల నిర్మాణాత్మక కృషి ఎంతో ఉంది. కాన్సాస్ రాష్ట్రంలోకి భారతీయులకు ఎప్పుడూ ఆహ్వానమే. ఓథెలే బార్‌లో తలెత్తినటువంటి దురదృష్టకర సంఘటనలు భారతీయులతో కాన్సాస్ మైత్రి, అనుబంధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవు. కాన్సాస్ ఉన్నతిలో భారతీయుల నిర్మాణాత్మక కృషికి ఎప్పుడూ కృతజ్ఞతలు’ అని కాన్సాస్ రాజధాని టోపెకలో జరిగిన శ్రీనివాస్ కూచిభొట్ల సంతాప కార్యక్రమంలో గవర్నర్ శామ్ వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనలో గాయాలపాలైన మేడసాని, గ్రిల్లాట్‌లు కార్యక్రమానికి హాజరయ్యారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి, గాయాలపాలైన మేడసానికి ఈ సందర్భంగా గవర్నర్ శామ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. ‘ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇయాన్ గ్రిల్లాట్‌కు ధన్యవాదాలు. కాల్పుల ఘటన గాయాల నుంచి గ్రిల్లాట్, మేడసానిలు త్వరగా కోలుకోవాలి’ అని గవర్నర్ శామ్ ఆకాంక్షించారు. ‘సత్యమేవ జయతే అన్న సంస్కృతి మంత్రాన్ని అనుసరించి శాంతిని కోరుకుందాం. ఈ సూత్రంమీద నమ్మకంతోనే మార్చి 16ను కాన్సాస్‌లో ఇండియన్ అమెరికన్ డేగా ప్రకటిస్తున్నామని గవర్నర్ ప్రకటించారు. ‘కొన్ని దురదృష్టకర సంఘటనలను దృష్టిలో పెట్టుకోవద్దు. ఈ కోణంలో ఇలాంటి ఘటనలు తలెత్తినా సహించేది లేదు. ఇలాంటి ఘటనలు మన మైత్రిపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోవు. ఎంతమంది భారతీయులకైనా కాన్సాస్ ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. కాన్సాస్‌లోని భారత జాతి వెనుక మేమున్నాం. ధైర్యంగా ఉండండి’ అని గవర్నర్ శామ్ బ్రౌన్‌బ్యాక్ భరోసా ప్రకటించారు.