అంతర్జాతీయం

హెచ్1బి దుర్వినియోగంపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 4: హెచ్1బి వీసాలను ఎట్టి పరిస్థితిలోనూ దుర్వినియోగం చేయరాదని ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా స్థానిక ఉద్యోగులపట్ల ఏ రకమైన వివక్ష చూపించినా సహించేది లేదని స్పష్టం చేసింది. ‘వివిధ యాజమాన్యాలు హెచ్1బి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తూ, అమెరికన్ ఉద్యోగులపట్ల వివక్ష చూపిస్తే జస్టిస్ విభాగం చర్యలు తీసుకుంటుంది’ అని తాత్కాలిక సహాయ అటార్నీ జనరల్ టామ్ వీలర్ పేర్కొన్నారు. భారత ఐటి కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్ వంటి వాటిని లక్ష్యం చేసుకునే ఆయన ఈ ప్రకటన చేశారు. ఎందుకంటే హెచ్1బి వీసాలవల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్నది ఈ కంపెనీలే. అక్టోబర్ ఒకటినుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త హెచ్1బి వీసా దరఖాస్తులను సోమవారం నుంచి స్వీకరిస్తున్న నేపథ్యంలో అమెరికా ట్రంప్ సర్కారు ఈ హెచ్చరిక జారీ చేసింది. ఈ వీసాలకు సంబంధించి ఎలాంటి మోసాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు రాకుండా కచ్చితంగా వ్యవహరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈసారి హెచ్1బి వర్క్ వీసాల జారీలో అమెరికా చాలా కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టమవుతోంది. జనరల్ కేటగిరీలో 65వేలు, ఇతర కేటగిరీలో 20వేల హెచ్1బి వీసాల జారీకి పరిమితి ఉంది. విదేశీ కంపెనీలు అత్యుత్తమ నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలికంగా ఉద్యోగాలిచ్చేందుకు ఈ వీసా కార్యక్రమం వెసులుబాటునిస్తోంది. ‘చాలామంది అమెరికన్లు ఈ రంగంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి తగిన అర్హతలు కూడా ఉన్నాయి. వారు ఐటి కంపెనీల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఉద్యోగ ఆధారిత వలస కార్యక్రమాలపై వారు పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది’ అని అమెరికా సిఐఎస్ విభాగం పేర్కొంది. అమెరికా ఉద్యోగులు వారిస్థాయికి తగని ప్రదేశాల్లో ఉంచటం సరికాదని, ఏ కంపెనీ అయినా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు వెనుకాడేది లేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.