అంతర్జాతీయం

వీటోతో మమ్మల్ని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 4: అంతర్జాతీయ టెర్రరిస్టులను నిషేధించే విషయంలో వీటో అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాత్సారం చేసినంత మాత్రాన వారిపై చర్యలు తీసుకోవటంలో అడ్డుకోలేరని మంగళవారం అమెరికా స్పష్టం చేసింది. పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఏ మహమ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించే ప్రతిపాదనపై చైనా సాంకేతిక కారణాలను చూపుతూ అడ్డుకోవటంపై ఐరాసలో అమెరికా దౌత్యవేత్త నిక్కీ హీలే తీవ్రంగా ఖండించారు. ‘ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. జాబితాలో ఉన్న వారిపై ఆంక్షలు విధించటంపై చర్చించాం. దీన్ని ఏ విధంగా సాధించాలో కూడా మాట్లాడటం జరిగింది. దక్షిణాసియా ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవటంపై చేస్తున్న ప్రయత్నాల గురించి, మసూద్ అజర్ వంటి వారిపై ఆంక్షలు విధించటాన్ని చైనా అడ్డుకోవటం గురించి ఆమెను ప్రశ్నించినప్పుడు ‘‘కొన్ని అంశాలపై వీటో ప్రయోగించే వాళ్లు ఉన్నారు. అయినంత మాత్రాన చర్యలు తీసుకోవటంలో అమెరికాను అడ్డుకునే వారు లేరు’’ అని ఆమె స్పష్టం చేశారు. తమ లక్ష్యం వేరువేరుగా సాధించే దానికంటే కలిసికట్టుగా సాధించేది అధికంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఖాళీగా ఉండదని, తమ దేశానికి ఫలితం రావటమే ప్రధానమని ఆమె అన్నారు. ‘‘మీరు ఇప్పటికే చూసి ఉంటారు. ప్రభుత్వం ఎంత క్రియాశీలంగా వ్యవహరిస్తోందో. నా ఉద్దేశంలో మనం చర్యలు తీసుకోవాలి. అందుకు ఆదేశాలు జారీ చేయాలి’’ అని అన్నారు.