అంతర్జాతీయం

తీర్పు, చార్జిషీట్ ప్రతులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/ లాహోర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పాకిస్తాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించిన భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌ను భారత కాన్సుల్ కలవడానికి అవకాశం కల్పించాలని భారత్ మరోసారి పాకిస్తాన్‌ను కోరింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ గౌతం బంబవాలే శుక్రవారం పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జాంజువాతో భేటీ అయి కుల్‌భూషణ్ జాదవ్ అంశాన్ని చర్చించారు. ఈ సందర్భంగా ఆయన జాదవ్‌ను భారత కాన్సుల్ కలవడానికి వీలు కల్పించాలని కోరారు. జాదవ్ విషయంలో భారత్ ఇలా కోరడం 14వ సారి.
అలాగే జాదవ్‌పై నమోదు చేసిన అభియోగాలతో కూడిన చార్జిషీట్ ప్రతిని, మిలిటరీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని ఇవ్వాల్సిందిగా భారత్ కోరింది. పాకిస్తాన్ మిలిటరీ చట్టాన్ని అధ్యయనం చేసిన తరువాత మిలిటరీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పై న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని కూడా భారత్ పాకిస్తాన్‌కు తెలిపింది. అయితే జాదవ్‌ను భారత కాన్సుల్ కలవడానికి అవకాశమివ్వాలన్న డిమాండ్‌ను పాకిస్తాన్ తోసిపుచ్చింది. జాదవ్ కేసు గూఢచర్యానికి సంబంధించిందని, అందువల్ల భారత కాన్సుల్‌తో కలిసే అవకాశం ఇవ్వబోమని తెగేసి చెప్పింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు అయిన సర్తాజ్ అజీజ్ కూడా ఈ అంశంపై స్పందించారు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం జాదవ్‌కు శిక్ష విధించడం జరిగిందని, పై కోర్టులో అప్పీలు చేయడానికి 40 రోజుల సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. జాదవ్ అంశంపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వాక్చాతుర్యంతో కూడిన ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలని అజీజ్ భారత్‌ను హెచ్చరించారు. జాదవ్‌ను ఇరాన్‌లో అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొనడం భారతదేశ వాక్చాతుర్యానే్న ప్రదర్శిస్తోందని ఆయన పేర్కొన్నారు. 40 రోజుల లోపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసుకునే హక్కు జాదవ్‌కు ఉందని, అలాగే ఈ కాల పరిమితిలోగా ఆర్మీ చీఫ్‌కు, అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్ కూడా పెట్టుకోవచ్చని అజీజ్ అన్నారు.
పాక్ జాతీయులకు వీసాలపై ఆంక్షలు!
పాకిస్తాన్ జాదవ్‌కు మరణ శిక్ష విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత్.. పాకిస్తాన్ జాతీయులకు వీసాలు మంజూరు చేసే ప్రక్రియను నెమ్మదింప చేయొచ్చని భావిస్తున్నారు. పాకిస్తాన్ జాతీయులకు అన్ని రకాల వీసాలపై నిషేధం విధించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, తొలుత దృష్టి సరిగా ఉన్న ప్రజల వీసాలపై ఆంక్షలు విధించాలని భారత విదేశాంగ శాఖ కోరుకుంటోందని ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. అనేక కేసుల్లో మానవతా దృక్పథాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉందని, అందువల్ల అందరి వీసాలపై ఆంక్షలు విధించే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
జాదవ్ కేసును వాదించొద్దు
ఇదిలా ఉండగా, జాదవ్ కేసును ఎవరూ వాదించొద్దని న్యాయవాదులను లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ (ఎల్‌హెచ్‌బిఎ) శుక్రవారం హెచ్చరించింది. ఏ న్యాయవాది అయినా జాదవ్ కేసును వాదిస్తే, సదరు న్యాయవాదిపై చర్య తీసుకుంటానని అల్టిమేటం ఇచ్చింది. ‘్భరత గూఢచారి కుల్‌భూషణ్ జాదవ్‌కు న్యాయ సహాయం చేయడానికి ముందుకు వచ్చే న్యాయవాది సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎల్‌హెచ్‌బిఎ ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని బార్ అసోసియేషన్ సెక్రటరి జనరల్ అమెర్ సరుూద్ రాణా ఎల్‌హెచ్‌బిఎ సమావేశానంతరం తెలిపారు.