అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో కొత్త పౌరసత్వ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఏప్రిల్ 20: ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా కొత్త పౌరసత్వ చట్టాలను గురువారం ప్రకటించింది. భారతీయులు ఎక్కువగా ఆధారపడే 457వర్క్ వీసాను రద్దు చేసిన రెండు రోజుల్లోనే ప్రధాని మాల్కం టర్న్‌బుల్ కొత్త చట్టాలను వెలువరించారు. దీంతో ప్రస్తుత పౌరసత్వ చట్టాలు, వలస చట్టాలకు చెల్లుచీటీ పాడినట్లయింది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఆస్ట్రేలియా పౌరసత్వం సంపాదించాలంటే ఇంగ్లీష్‌లో మంచి ప్రావీణ్యం ఉండి తీరాలి. దీంతోపాటు కనీసం నాలుగేళ్లపాటు ఆస్ట్రేలియాలో నివసిస్తేనే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం సంపాదించేందుకు ఇప్పటివరకూ ఎన్నిసార్లయినా ప్రయత్నించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి ఉండబోదు. పౌరసత్వం సంపాదించటంలో మూడుసార్లు ఫెయిలయితే, రెండేళ్లపాటు ప్రయత్నించేందుకు వీలుండదు. ఇందుకు సంబంధించిన పరీక్షలో మోసం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేసినా అటోమేటిక్‌గా అనర్హులవుతారు. పౌరసత్వం కావాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఇంగ్లీష్ పరీక్షలో పాస్ కావలసి ఉంటుంది. ఇందులోనూ మహిళలు, పిల్లలకు సంబంధించిన ప్రశ్నావళి ఎక్కువగా ఉంటుంది. సదరు అభ్యర్థి వారికి ఎలాంటి గౌరవం ఇస్తారన్నది ఈ పరీక్షలో తేలిపోతుంది. దీంతోపాటు ఆస్ట్రేలియా విలువలు, బాధ్యతల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారన్నదానిపైనా ఈ పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి. ఆస్ట్రేలియా విలువలను, చట్టాలను గౌరవించేవారికే పౌరసత్వం లభిస్తుందని ప్రధాని మాల్కం టర్న్‌బుల్ స్పష్టం చేశారు.
నేరపూరిత చర్యలు, గృహ హింస, వ్యవస్థీకృత నేరాలలో భాగస్వాములయ్యే వారిని ఎట్టి పరిస్థితిలోనూ తమ దేశంలోకి అనుమతించే ప్రశే్న లేదని ఆయన తెలిపారు. గతంలో కేవలం 12 నెలలకే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు నాలుగేళ్లు తప్పనిసరిగా అస్ట్రేలియాలో నివాసం ఉంటేనే పౌరసత్వం లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్ విభాగం పరీక్ష పాసైన తరువాత ఈ ప్రతిపాదనలను పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్న విదేశీయులలో ఎక్కువమంది భారతీయులే కావటం గమనార్హం. ఇప్పుడు ఆస్ట్రేలియా విలువలను గౌరవించటంతోపాటు, ఇంగ్లీష్‌లో అపరిమిత ప్రావీణ్యం, ఉద్యోగార్హతల్లో అత్యున్నత ప్రావీణ్యాలు తప్పనిసరి అవుతాయి. కొత్త విధానంతో భారతీయులపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.