అంతర్జాతీయం

రెచ్చగొడితే భారీ మూల్యం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 21: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా మరోసారి మండిపడింది. దలైలామా పర్యటనకు ప్రతిగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాల పేర్లను మార్చిన చైనా అలా పట్టణాల పేర్లను మార్చే చట్టపరమైన హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు భారత్ గనుక దలైలామా కార్డును ప్రయోగించడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కో తప్పదని చైనా అధికార మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ హెచ్చరించింది. ‘్భరత్-చైనా సరిహద్దు తూర్పు ప్రాంతం(అరుణాచల్ ప్రదేశ్)పై చైనా వైఖరి ఎప్పుడూ చాలా స్పష్టంగా, ఒకే విధంగా ఉంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్‌లో పట్టణాల పేర్లను ప్రామాణీకరించడం తమ చట్టపరమైన హక్కు అనే ప్రచారాన్ని సైతం చైనా మొదలుపెట్టింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఒక కథనాన్ని సైతం ప్రచురించింది.
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న విషయం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాలకు చైనా కొత్తపేర్లు పెట్టడంపై భారత్ గురువారం తీవ్రంగా మండిపడుతూ, అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతి అంగుళం భారత్ భూభాగమేనని స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై లు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మ వైపు భారత్ స్పందనపై ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక కథనం వ్యాఖ్యానిస్తూ అరుణాచల్‌లో పట్టణాల పేర్లను చైనా ప్రభుత్వం ఇప్పుడే ప్రామాణీకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో భారత్ గ్రహించాలని వ్యాఖ్యానించింది. దలైలామా కార్డును ప్రయోగించడం ఎంతమాత్రం తెలివైన పని కాదనే విషయాన్ని భారత్ గ్రహించాలని, తన తీరును గనుక మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్‌కు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని కూడా విమర్శించింది. ‘గత కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పద ప్రాంతాలకు వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా 1987లో అరుణాచల్ ప్రదేశ్ (చైనాకు చెందిన దక్షిణ టిబెట్‌ను) అధికారిక రాష్ట్రంగా ప్రకటించింది’ అని కూడా ఆ పత్రిక ఆరోపించింది.