అంతర్జాతీయం

షాంఘై సదస్సులో మోదీ-షరీఫ్ భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 10: షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఓ)శిఖరాగ్ర భేటీ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాల్గొనే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. భారత్ ఆసక్తి కనబరిస్తే.. మోదీతో నవాజ్ షరీఫ్ సమావేశమయ్యే అవకాశంపై దృష్టి పెడతామని పాక్ దౌత్యవేత్త సర్తాజ్ అజీజ్ తెలిపారు. వచ్చే నెల్లో ఈ సమావేశం జరుగనున్న దృష్ట్యా ఇప్పటి నుంచే దీనిపై చర్చ జరపడం తొందరపాటే అయినప్పటికీ భారత్ అంగీకరిస్తే మాత్రం షరీఫ్‌తో మోదీ భేటీకి గల అవకాశాలను పరిశీలిస్తామని సర్తాజ్ తెలిపారు. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో వచ్చే నెల 8-9తేదీల్లో జరుగుతున్న ఎస్‌సిఓ సమావేశంలో మోదీ-షరీఫ్ సమావేశానికి అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగానే స్పందించడం గమనార్హం. అయితే భారత్ నుంచి సానుకూల స్పందన వచ్చే పక్షంలోనే ఇందుకు గల అవకాశాలను తాము పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ శిఖరాగ్ర భేటీలోనే భారత్-పాక్‌లను ఆరు దేశాల ఎస్‌సిఓలో చేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఇటీవల భారత సైనికుడి తలను పాక్ సైనికులు నరికిన సంఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అలాగే కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ మరణ శిక్ష విధించడమూ ఈ ఉద్రిక్తతలకు మరింతగా ఆజ్యం పోసింది. బీజింగ్ ప్రధాన కేంద్రంగా చైనా సారధ్యంలో ఎస్‌సిఓ పనిచేస్తోంది.