అంతర్జాతీయం

‘రాన్‌సమ్‌వేర్’ను ముందే పసిగట్టిన తెలుగు డాక్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 13: రాన్‌సమ్‌వేర్ వైరస్ కారణంగా దేశంలోని అనేక ఆస్పత్రులు మూసివేసే పరిస్థితులు రావచ్చని ఈ హ్యాంకింగ్ ఉదంతం వెలుగు చూడడానికి కొద్దిరోజుల ముందు బ్రిటిష్ జాతీయ ఆరోగ్య పథకం అధికారులను బ్రిటన్‌లో పని చేస్తున్న ఓ ప్రవాసాంధ్రుడు హెచ్చరించాడు. లండన్ న్యూరోసర్జరీకి చెందిన జాతీయ ఆస్పత్రిలో న్యూరాలజీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న డాక్టర్ కృష్ణ చింతపల్లి గత బుధవారం ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్’లో రాసిన ఓ వ్యాసంలో ఈ హెచ్చరిక చేశారు. కేంబ్రిడ్జిలోని పాప్‌వర్త్ ఆస్పత్రిలో జరిగిన ఓ ఉదంతాన్ని సైతం ఆయన తన వ్యాసంలో ఉదహరించారు. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సు ఒకరు పొరబాటున ఈ వైరస్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఆమె కంప్యూటర్‌లోకి వైరస్ చొరబడి కీలకమైన ఫైళ్లను నాశనం చేయడం ప్రారంభించింది.
అయితే అదృష్టవశాత్తు అప్పటికే ఆస్పత్రి డెయిలీ డేటా బ్యాకప్ పూర్తి చేయడం జరిగిందని కూడా ఆయన ఆ వ్యాసంలో తెలిపారు. తాము చాలా లక్కీ అని ఆస్పత్రి ఐటి డైరెక్టర్ కూడా అంగీకరించారని, అయితే ఈ ఏడాది రాన్‌సమ్‌వేర్ కారణంగా మరిన్ని ఆస్పత్రులు మూతపడడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నందున అన్నిటికీ తాము సర్వసన్నద్ధంగా ఉండాలని కూడా తెలిపినట్లు డాక్టర్ కృష్ణ ఆ వ్యాసంలో తెలిపారు.
కిల్లర్ వైరస్‌కు మందు
హాంకాంగ్: రాన్సమ్‌వేర్ ‘వాన్నాక్రై’కి ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు కిల్లర్ స్విచ్‌ను కనుగొన్నారు. దాన్ని ఉపయోగిస్తే ఈ వైరస్ కంప్యూటర్‌ను ఏమీ చేయలేదు. ఇప్పటికి వాన్న క్రైని ఆపగలిగే ఏకైక మందు ఇదే. ‘్ఘౄత్ఘీళఆళష్దఇ్య అనే ట్విట్టర్ ఖాతాలో ధీనికి సంబంధించిన సమాచారాన్ని ఇతను ట్వీట్ చేస్తున్నాడు. తాను అనుకోకుండా దీన్ని కనుగొన్నట్లు అతను పేర్కొన్నాడు.