అంతర్జాతీయం

ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 14: ఉత్తరకొరియా తాజాగా జరిపిన బాలెస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని రెచ్చగొట్టే చర్యగా అమెరికా అభివర్ణించింది. ఉత్తరకొరియా దూకుడు అరికట్టేందుకు బలమైన ఆంక్షలను విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటివరకు విధించిన ఆంక్షలన్నింటి కూడా మరిన్ని కఠినతరమైన చర్యలను చేపట్టాల్సి అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని ఉత్తరకొరియా తాజా చర్య స్పష్టం చేస్తోందని వైట్‌హౌస్ అధికారి సీన్‌స్పైసర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తర కొరియా తాజా జరిపిన క్షిపణి పరీక్షను అమెరికా ఫసిపిక్ కమాండ్ హవాయ్ కాలమానం ప్రకారం ఉదయం పదిన్నరకు గుర్తించింది. కుసుంగ్ ప్రాంతం సమీపం నుంచి జరిపిన ఈ క్షిపణి పరీక్ష అనంతరం జపాన్ సముద్రంలో పడింది. ఏ రకమైన క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిందన్నదానిపై పరిశీలన జరుపుతున్నామని అమెరికా తెలిపింది. దీన్ని ఖండాంతర క్షిపణి అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని వెల్లడించింది. ఖండాంతర క్షిపణికి ఉండాల్సిన లక్షణాలు ఈ తాజా క్షిపణికి లేవని అమెరికా ఫసిపిక్ కమాండ్ స్పష్టం చేసింది. అయతే ఈ క్షిపణి జపాన్ కంటే కూడా రష్యాకు చేరువుగానే పడిందని వెల్లడించింది. ఉత్తరకొరియా చర్యను రష్యా హర్షించే అవకాశం లేదని తమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నట్టుగా వైట్‌హౌస్ అధికారి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంగా ఉత్తరకొరియా ప్రపంచ శాంతికే ఓ సవాల్‌గా మారిందని పేర్కొన్న ఆయన ఈ దేశ నాయకత్వ చేష్టలను ఇటు జపాన్, అటు దక్షిణ కొరియాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరకొరియాను ఉపేక్షించబోమని, తమ మిత్ర దేశాలను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.