అంతర్జాతీయం

నేడు మరో సైబర్ దాడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 14: ప్రపంచవ్యాప్తంగా ‘వన్నా క్రై’ మాల్‌వేర్ కలకలం సృష్టిస్తోంది. భారత్ సహా 150కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా బాధితులు దీని బారినపడ్డారు. కేవలం వ్యక్తులనే కాకుండా ఆస్పత్రులు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజన్సీలు తదితర సంస్థల్ని కూడా మాల్‌వేర్ దెబ్బతీసింది. ఈ గొడవ ఇంకా సద్దుమణగక ముందే మరోసారి సైబర్ దాడి జరిగే అవకాశముందని సాఫ్ట్‌వేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహుశా సోమవారమే ఆ దాడి జరిగే అవకాశాలున్నాయని వారంటున్నారు. సైబర్ దాడికి పాల్పడిన హ్యాకర్లకోసం వేట కొనసాగుతోంది. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ సైబర్ దాడి బారిన పడిన వారి సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటుందని ఐరోపాకు చెందిన ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ చీఫ్ ఆదివారం చెప్పారు. 150కి పైగా దేశాల్లోని ఈ బాధితుల్లో వ్యక్తులు మొదలుకొని ఆస్పత్రులు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజన్సీలు, ప్రముఖ కంపెనీలు లాంటివి కూడా ఉన్నాయని కూడా ఆ నిపుణుడు అంటున్నారు. ‘ప్రస్తుతం మనం ఒక గొప్ప ముప్పును ఎదుర్కొంటున్నాం. గంటగంటకు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం ఉదయం ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి తమ కంప్యూటర్లను ఆన్ చేసినప్పుడు ఈ సంఖ్య ఎలా పెరుగుతుందనే విషయమే నాకు ఆందోళన కలిగిస్తోంది’ అని యూరోపోల్ డైరెక్టర్ రాబ్ వెయిన్‌రైట్ అన్నారు. సైబర్ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించడానికి అన్ని దేశాలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయి.
కోలుకొంటున్న దేశాలు
‘వన్నా క్రై’ మాల్‌వేర్ దాడికి గురయిన దేశాలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. ఈ దాడి ప్రభావాన్ని తట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ను రూపొందించి దాన్ని వీలయినంత త్వరగా డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేయడంద్వారా ఈ మాల్‌వేర్‌నుంచి రక్షణ పొందవచ్చని తెలిపింది. ఇప్పుడిప్పుడే వివిధ దేశాల్లో ఈ మాల్‌వేర్ బారిన పడిన సంస్థలు దాని ప్రభావంనుంచి బైటపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, హ్యాకర్లు ఈ మాల్‌వేర్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 30 వేల డాలర్లకు పైగానే సంపాదించినట్లు చెప్తున్నారు. మాల్‌వేర్‌ను కంప్యూటర్లలోకి చొప్పించడం ద్వారా అవి పని చేయకుండా చేసే హ్యాకర్లు అవి తిరిగి పని చేసేలా చేయడం కోసం 300నుంచి 600 డాలర్ల దాకా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అప్రమత్తంగా ఉండండి
న్యూఢిల్లీ: ఇదిలా ఉండగా ఈ మాల్‌వేర్ దాడినుంచి తమ కంప్యూటర్లను కాపాడుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బ్యాంకులు, విమానాశ్రయాలు, రేవులు, టెలికాం నెట్‌వర్క్‌లు, స్టాక్ మార్కెట్లు లాంటి దేశంలోని కీలకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజన్సీలను న్యూఢిల్లీలోని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్‌టి-ఇన్) డైరెక్టర్ జనరల్ సంజయ్ బహల్ తెలిపారు. ఇప్పటికే అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజన్సీలకు అడ్వయిజరీలను పంపించడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. మైక్రోసాఫ్ట్ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ని అప్లై చేయడం ద్వారా చర్యలు తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని ఆయన అంటూ, ఇంకా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉంటే తక్షణ డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా సూచించారు.