అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 8: కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్న 26ఏళ్ల తెలంగాణ యువకుడు ముబీన్ అహ్మద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు గా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తీవ్రం గా గాయపడ్డ అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రస్తుతం ఐసియూలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కొన్ని నెలల క్రితం కాన్సాస్‌లో కూచిభొట్ల ఉదంతం నేపథ్యంలో ఈ సంఘటన జరగడం ఆందోళన రేకెతిస్తోంది. దీన్ని జాతి విద్వేష దాడిగానే భావిస్తున్నారు. ముబీన్ ఇటీవలే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తమకుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం అందడంతో ముబీన్ తల్లిదండ్రులు తమను అమెరికా పంపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది.