అంతర్జాతీయం

ఫలించిన నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తానా, జూన్ 9:నాటో కూటమిటి సరిసమానమైన ఉజ్జీగా భావిస్తున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ)లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్,పాక్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది. భారత్ అభ్యర్థిత్వాన్ని రష్యా, పాకిస్తాన్ అభ్యర్థిత్వాన్ని చైనా బలపరిచాయి. గత రెండు సంవత్సరాలుగా ఎదురుచూసిన ఈ లక్ష్యం ఇరు దేశాలకు నెరవేరినట్టయింది. చైనా సారధ్యంలోని ఎస్‌సిఓ సభ్యదేశాలు దాదాపు 40శాతానికి పైగా ప్రపంచ జనాభాను, 20శాతానికి పైగా ప్రపంచ జీడిపిని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఎస్‌సిఓ సభ్యత్వం లభించడంతో ఉగ్రవాద నిరోధానికి సంబంధించి భారత్ మరింత గట్టిగా తన వాదనను వినిపించే అవకాశం ఉంటుంది. భారత్-పాకిస్తాన్‌లు తమ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందాయని, ఇది తమకు ఎంతో కీలకమైన అంశమని ఎస్‌సిఓ ప్రస్తుత చైర్మన్, కజకిస్థాన్ అధ్యక్షుడైన నుర్‌సుల్తాన్ నజర్‌బాయేవ్ అన్నారు. ఎస్‌సిఓ సభ్యత్వం వల్ల భారత్‌కు అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది. మధ్య ఆసియా ప్రాంతంలోనూ, ఎస్‌సిఓ దేశాల్లో నూ అపారంగా చమురు, వాయు నిక్షేపాలు ఉన్నా యి కాబట్టి తన అవసరాలను గణనీయంగా తీర్చుకోగలుగుతుంది. 2015లోనే భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని కల్పించే ప్రయత్నాలకు ఎస్‌సిఓ శ్రీకారం చుట్టింది. రష్యాలో జరిగిన ఆ శిఖరాగ్ర సదస్సులోనే పాకిస్తాన్‌కూ సభ్యత్వం కల్పించేందుకు పాలనాపరమైన అవరోధాలనూ తొలగించారు. 2001లో రష్యా, చైనా, ఖర్ఘిజ్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులతో జరిగిన శిఖరాగ్ర సదస్సులో షాంఘై కూటమి ఏర్పడింది.

చిత్రం.. ఎస్‌సిఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ పలకరింపు