అంతర్జాతీయం

జిన్‌పింగ్‌తో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తానా, జూన్ 9: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యా రు. అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో సభ్య త్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌సహా వివిధ అంశాలపై విభేదాల వలన దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మోదీ ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడితో చర్చించారు. బీజింగ్‌లో గత నెల 29 దేశాల నాయకులు పాల్గొన్న ‘బెల్ట్ అండ్ రోడ్’ ఫోరం సమావేశాన్ని భారత్ బహిష్కరించిన తర్వాత మోదీ, జిన్‌పింగ్ సమావేశమవడం ఇదే తొలిసారి. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు (బిఆర్‌ఐ)లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె) లోని గిల్గిత్, బాల్టిస్తాన్ మీదుగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ పట్ల భారత్‌కు గల ఆందోళనలను తెలియజెప్పేందుకు మన దేశం ఈ సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత్, చైనా సంబంధాల తీరు తెన్నులు, వీటిని మరింత మెరుగుపర్చుకోవడం ఎలా అనే అంశాలపై జిన్‌పింగ్‌తో చర్చించానని ‘ట్విట్టర్’ లో మోదీ పేర్కొన్నారు. ఆస్తానాలో జిన్‌పింగ్‌తో భేటీ ముగిసిన తర్వాత మోదీ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియొయెవ్‌తో కూడా సమావేశమయ్యా రు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు మోదీ ట్వీట్ చేశారు.