అంతర్జాతీయం

ఆ ముగ్గురు ‘మొనగాళ్ల’ సంతానం 96!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బన్ను (పాకిస్తాన్), జూన్ 10: పాకిస్తాన్‌లో ముగ్గురు ‘మొనగాళ్లు’. దాదాపు 100 మంది పిల్లలకు వారు తండ్రులు. అయినా సంతాన కాంక్ష ఏమాత్రం తగ్గని వారు ‘ఒకరు లేదా ఇద్దరు చాలు’ అన్న నానుడిని పక్కన పెట్టి తమ ‘పటిమ’ను ఇంకా నిరూపించుకుంటున్నారు. తద్వారా పాక్ జనాభా ఇతోధికంగా పెరగడంలో తమవంతు ‘సేవ’లను కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్‌లో 19 ఏళ్ల తర్వాత తొలిసారి జరుపుతున్న జనగణనలో ఈ విషయం వెల్లడవడంతో అధికారులు విస్తుపోతున్నారు. దేశంలో జనాభా రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతుండటంతో ఆర్థిక ఫలాలను, సామాజిక సేవలను అందరికీ అందించడం సాధ్యమవడం లేదని వాపోతూ అధికారులు చేస్తున్న హెచ్చరికలను ఈ ముగ్గురు ‘పురుష పుంగవులు’ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ‘ఈ మొత్తం విశ్వాన్ని, మానవాళిని సృష్టించింది దేవుడు. ఆయన వరప్రసాదమైన పిల్లలకు జన్మనివ్వకుండా ఎందుకు ఆపాలి?’ అంటూ ఇప్పటికే 36 మందికి జన్మనిచ్చిన గుల్జార్ ఖాన్ (57) ఎదురు ప్రశ్నిస్తున్నాడు. 15 మంది తోబుట్టువుల్లో ఒకడైన గుల్జార్ ఖాన్ ముగ్గురు మహిళలకు భర్త. ప్రస్తుతం అతను పాక్ వాయువ్య గిరిజన ప్రాంతంలోని బన్ను నగరంలో నివసిస్తున్నాడు. అలాగే గుల్జార్ సోదరుల్లో ఒకడైన మస్తాన్ ఖాన్ వజీర్ (70) ప్రస్తుతం 22 మంది పిల్లలకు తండ్రి. గుల్జార్‌కు మాదిరిగా ముగ్గురు మహిళలకు భర్త అయిన వజీర్ తన మనవలు, మనువరాండ్ర సంఖ్య అయితే లెక్కించడమే కష్టమని చెబుతున్నాడు. బలూచిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో నివసిస్తున్న జాన్ మొహమ్మద్ అనే మరో ప్రబుద్ధుడు ఇప్పటివరకూ నలుగురు భార్యల ద్వారా 38 మంది పిల్లలకు జన్మనిచ్చి తన ‘సత్తా’ చాటుకున్నాడు.