అంతర్జాతీయం

ఐరాస కీలక కమిటీకి భారత్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 16: ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలకు సంబంధించిన ప్రధాన విభాగంలో సభ్యురాలిగా భారత దేశం మరోసారి తిరిగి ఎన్నికయింది. ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ (ఎకోసోక్)లో సభ్యులుగా ఎన్నికయిన 18 దేశాల్లో భారత్ కూడా ఉంది. మూడేళ్ల పాటు భారత్ ఈ మండలిలో సభ్యురాలుగా ఉంటుంది. కౌన్సిల్‌లోని 18 ఖాళీలలను భర్తీ చేయడం కోసం గురువారం నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌కు 183 ఓట్లు వచ్చాయి. ఆసియా పసిఫిక్ కేటగిరీలో జపాన్ తర్వాత భారత్‌కే అత్యధిక ఓట్లు లభించాయి. ఎకోసోక్‌కు భారత్ తిరిగి ఎన్నికయిందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌కు మద్దతు తెలిపిన ఐరాస సభ్య దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర జలాలకు సంబంధించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్‌కు భారతీయ మహిళ నీరు చద్దా ఎన్నికయిన ఒక రోజు తర్వాత భారత్ ఎకోసోక్‌లో సభ్యురాలిగా ఎన్నిక కావడం గమనార్హం. ఆసియా పసిఫిక్ ప్రాంతంనుంచి చద్దా 120 ఓట్లు సంపాదించి తొలి రౌండ్‌లోనే విజయం సాధించి ఈ ట్రిబ్యునల్‌కు ఎన్నికయిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఎకోసోక్‌లో భారత్ ప్రస్తుత సభ్యత్వం ఈ ఏడాదితో ముగుస్తుంది. కౌన్సిల్‌లో పాకిస్తాన్ కాలపరిమితి కూడా ఈ ఏడాదే ముగియనుంది. మరోసారి కౌన్సిల్‌లో సభ్యత్వం కోసం పాక్ పోటీ చేసినప్పటికీ ఆ దేశానికి కేవలం ఒకే ఒక ఓటు రావడంతో ఓడిపోయింది. 2018 జనవరి 1నుంచి మూడేళ్ల కాలానికి ఎకోసోక్‌లో సభ్యులుగా ఎన్నికయిన దేశాల్లో బెలారస్, ఈక్వడార్, ఎల్ సాల్వడార్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, భారత్, ఐర్లాండ్, జపాన్, మలావి, మెక్సికో, మొరాకో, ఫిలిప్పీన్స్, స్పెయిన్, సూడాన్, టోగో, టర్కీ, ఉరుగ్వే ఉన్నాయి. ఈ కౌన్సిల్‌కు తిరిగి ఎన్నికయిన దేశాల్లో భారత్‌తో పాటుగా ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, ఐర్లాండ్, జపాన్ దేశాలున్నాయి. 54 దేశాలు సభ్యులుగా ఉండే ఈ కౌన్సిల్‌లో మూడోవంతు స్థానాలు ప్రతి మూడేళ్లకోసారి ఖాళీ అవుతాయి. ఖాళీ అయిన స్థానాలకు కొత్త సభ్యులను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సభ్య దేశాలు ఎన్నుకుంటాయి. భౌగోళిక ప్రాతినిధ్యం ఆధారంగా ఈ స్థానాలను కేటాయించడం జరుగుతుంది. ఆఫ్రికా దేశాలకు 14 స్థానాలు, ఆసియా దేశాలకు 11, తూర్పు ఐరోపా దేశాలకు ఆరు, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు పది, పశ్చిమ ఐరోపా, తదితర దేశాలకు 13 స్థానాలు కేటాయించారు.