అంతర్జాతీయం

యువత ఉపాధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 17: దేశం లో అందుబాటులో ఉన్న అన్ని రంగాల్లో యువత ఉపాధి పొం దేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంతో దేశ యువత అన్ని రంగాల్లో సాంకేతిక పరంగా అనుభవాన్ని గడించడమే కాకుం డా మెరికల్లా తయారవుతారని ఆకాంక్షించారు. దేశం లో యువతకు సాంకేంతిక పరంగా ఉత్త మ శిక్షణను అందించేందుకు ఉద్దేశించిన ఔత్సాహిక శిక్షణా కార్యక్రమాన్ని గత గురువారమే ప్రారంభించిన ట్రంప్ నేడు ఈ మేరకు దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో చేసిన ప్రసంగించారు. అమెరికా యువత అద్భుతమైన శక్తియుక్తులతోపాటు మేధాశక్తిని కలిగి ఉందని వారికి సరైన మార్గంలో శిక్షణనిస్తే జీవితంలో బాగా రాణిస్తారని పేర్కొన్నారు. చిన్నా పెద్దా అని తేడాలేకుండా అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. సాంకేతిక రంగంలో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సామ ర్థ్యం అమెరికా యువతలో మొండుగా ఉందని అయ న పేర్కొన్నారు.
శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు.