అంతర్జాతీయం

ఫేస్‌బుక్ మోజులో తల్లి.. బాత్‌టబ్‌లో బిడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, జూన్ 23: ఓ తల్లి నిర్లక్ష్యం కారణంగా ఎనిమిది నెలల ముక్కుపచ్చలారని చిన్నారి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో చెయెనే్న సమ్మర్ స్టక్కీ అనే 21 ఏళ్ల మహిళ స్నానం చేయించడం కోసం తన ఎనిమిది నెలల కుమార్తె జయ్లా హెర్నాండెజ్‌ను బాత్‌టబ్‌లో వదిలిపెట్టి నీళ్లు విప్పి ఫేస్‌బుక్‌లో మెస్సేజిలు పంపడంలో నిమగ్నమై పాప సంగతిని పూర్తిగా మరిచిపోయి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికి పాప గుర్తుకు వచ్చి తిరిగి వచ్చి చూసే సరికి ఆ పసిపాప బాత్ టబ్‌లో మునిగి పోయి కనిపించింది. పసిపాపను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసుల దర్యాప్తులో ఆమె ఫేస్‌బుక్‌లో ఇద్దరితో దాదాపు 18 నిమిషాల పాటు మెస్సేజిలు పంపుతూ గడిపినట్లు నిర్ధారణ అయింది. నీటిలో మునిగిపోయిన కారణంగానే జయ్లా మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.