అంతర్జాతీయం

ప్రస్తావిస్తే స్పందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 24: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగే శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి హెచ్-1బి వీసాల అంశాన్ని ప్రస్తావించినట్లయితే దానిపై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడితో మోదీ సోమవారం వైట్‌హౌస్‌లో భేటీ కానున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఉద్యోగాలు, వలసలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఉత్తర్వులను జారీ చేసిన ట్రంప్ ప్రభుత్వం, హెచ్-1బి వీసా నిబంధనలకు చేయదగిన సంస్కరణలను ప్రతిపాదించాల్సిందిగా విదేశాంగ శాఖతో పాటు అటార్నీ జనరల్‌ను, కార్మిక, ఆంతరంగిక భద్రతా శాఖల కార్యదర్శులను ఆదేశించింది. శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి గనుక హెచ్-1బి వీసాల అంశాన్ని ప్రస్తావిస్తే పై విషయాన్ని గుర్తుచేస్తా’ అని ఆ అధికారి తెలిపారు.
అయితే హెచ్-1బి వీసాలపై జరుపనున్న సమీక్ష ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని ముందుగానే అంచనావేసే పరిస్థితిలో ట్రంప్ ప్రభుత్వం లేదని, కనుక హెచ్-1బి వీసా దరఖాస్తుల్లో గానీ, వాటి జారీకి సంబంధించిన నిబంధనల్లో గానీ తక్షణమే మార్పులు జరిగే అవకాశం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. హెచ్-1బి వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాటి జారీకి సంబంధించిన నియమ, నిబంధనలను కఠినతరం చేస్తూ ఏప్రిల్‌లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడం పట్ల భారత్‌లో, ప్రత్యేకించి భారత ఐటి నిపుణుల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ అధికారి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.