అంతర్జాతీయం

‘ప్లానెట్ 10’ కనిపించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 25: అంతరిక్ష పరిశోధనల అంచనాలకు, ఊహలకు అందకుండా మిస్టరీ గ్రహంగా కొనసాగుతున్న ప్లానెట్ 10 మన సౌరవ్యవస్థ అంచుల్లో దాగి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అంగారక గ్రహాన్ని పోలిన ఓ గ్రహం మన సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న విషయాన్ని భారత శాస్తవ్రేత్తతో కూడిన రోదసి నిపుణుల బృందం గుర్తించింది. అయితే ఈ గ్రహం ప్లానెట్-9 కంటే భిన్నంగా, సూర్యుడికి మరింత దగ్గరగానే ఉన్న విషయాన్ని గుర్తించాల్సి ఉందని తెలిపారు. అరిజోనా యూనివర్శిటీకి చెందిన రేణు మల్హోత్రా సహా ఈ పరిశోధకుల బృందం ప్లానెట్-10కి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన వివరాలనే సేకరించగలిగింది. ఈ గ్రహ ద్రవ్యరాశి అంగారక గ్రహానికి, భూమికి మధ్యస్థంగా ఉండవచ్చునని తెలిపింది.