అంతర్జాతీయం

భారత్-ఇజ్రాయెల్ మధ్య మైత్రి మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, జూన్ 25: భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4నుంచి మూడు రోజుల పాటు తమ దేశంలో జరపబోతున్న పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రీబంధాన్ని మరింతగా బలోపేతం చేయగలదన్న ఆశాభావాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించని నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత మరింతగా పెరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, ఇలాంటి సానుకూల వాతావరణంతో భారత ప్రధాని తమ దేశానికి రావడం మైత్రీబంధానికి ఊతాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చేదని నెతన్యాహు తెలిపారు. కేబినెట్ సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు ‘జూలై 4నుంచి భారత ప్రధాని మూడు రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల కాలంలో ఆ దేశ ప్రధాని ఎవరూ ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు రాలేదు. ఏ రకంగా చూసినా మోదీ పర్యటన చారిత్రకమే అవుతుంది’ అని అన్నారు. 125 కోట్ల జనాభా కలిగిన భారత్ అతి పెద్ద దేశమని, ప్రపంచంలో అత్యంత విస్తృతంగా వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అని ఈ సందర్భంగా నెతన్యాహు అన్నారు.