అంతర్జాతీయం

వలసలపై నిషేధం పాక్షికంగా అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 26: వలసలపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విధించిన ఈ నిషేధాన్ని అమెరికా సుప్రీం కోర్టు సోమవారం పాక్షికంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై సుప్రీం కోర్టు అక్టోబర్‌లో పూర్తిస్థాయి విచారణ జరిపే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఇంతకుముందు అమెరికాలోని దిగువ కోర్టులు ఈ నిషేధం అమలు కాకుండా నిలిపివేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు దీనిని సుప్రీం కోర్టు పాక్షికంగా అమలులోకి తీసుకురావడంతో అమెరికాలోని సంస్థలతో గానీ, అక్కడ నివసిస్తున్న వారితో గానీ సంబంధం లేని వ్యక్తులకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ కేసుపై తదుపరి విచారణ జరిగే వరకూ వలసలపై నిషేధం అమలవుతుందని సుప్రీం స్పష్టం చేసింది. నిషేధం అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం మతస్థులను ఏకాకులను చేసేదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తినప్పటికీ దేశ భద్రత కోసం ఈ నిషేధం ఎంతో అవసరమని పట్టుబట్టిన ట్రంప్‌కు ఇది పెద్ద విజయంగానే చెప్పవచ్చు.