అంతర్జాతీయం

హిజ్బుల్ చీఫ్ సలాహుద్దీన్ అంతర్జాతీయ ఉగ్రవాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 26: హిజ్‌బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా విదేశాంగ విభాగం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల సమావేశానికి ముందే సోమవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం అన్నది భారత్ సాధించిన ఘన విజయంగా పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకుని సాగిస్తోన్న సమాంతర ఉగ్రవాదంపై ఇన్నాళ్లూ భారత్ చేస్తున్న వాదనలు అమెరికా నిర్ణయంతో రుజువైందని విదేశాంగ విభాగం ప్రతినిథి గోపాల్ బాగ్లే పేర్కొన్నారు. భారత్ -అమెరికాలు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్న ఆయన, ఈ జాడ్యాన్ని ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా నిర్మూలించడానికి సంయుక్తంగానూ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాద మూకలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించబోతోందని అనడానికి హుజ్బుల్ ముజాహిదీన్ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడమే నిదర్శనమన్నారు. ఈ చర్య ద్వారా అమెరికాలోవున్న సలాహుద్దీన్ ఆస్తులన్నీ జప్తు అవుతాయి. అతడితో ఏరకమైన లావాదేవీలు జరిపేందుకు అమెరికా పౌరులకు ఆస్కారం ఉండదని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం లేదని, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరిగినా అడ్డుకుంటామని గత ఏడాది సలాహుదీన్ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. అంతేకాదు, కాశ్మీర్‌లో ఆత్మాహుతి బాంబు దళాలను తయారు చేస్తానని, మొత్తం కాశ్మీర్ లోయనే భారత సైనికుల శ్మశాన వాటికగా మారుస్తానని కూడా సలాహుద్దీన్ హెచ్చరించినట్టు అమెరికా తన చర్యల ప్రకటనలో వెల్లడించింది. 2014లో కాశ్మీర్‌లో జరిగిన విధ్వంసం సహా హిజ్బుల్ ముజాహిదీన్ ప్రోద్భలంతో జరిగిన అనేక ఉగ్రవాద దాడులను ఇందులో ఉటంకించింది.