అంతర్జాతీయం

ప్రస్తావన లేని హెచ్ 1బి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 27: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా హెచ్1బి వీసాలకు సంబంధించి ట్రంప్ నుంచి హామీని పొందుతారని ఎదురుచూసిన మన దేశ ఐటి నిపుణులకు నిరాశే మిగిలింది. ట్రంప్‌తో జరిగిన భేటీలో మోదీ హెచ్1బి వీసాలకు సంబంధించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత హెచ్1బి వీసాల నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రభావం భారత ఐటి నిపుణులపైనే ఎక్కువగా ప్రభావం చూపింది. మోదీ తన పర్యటన నేపథ్యంలో ఈ అంశాన్ని కచ్చితంగా ప్రస్తావిస్తారని ముందునుంచీ అంతా భావించారు. కానీ వారిద్దరి చర్చల్లో ఈ అంశం భాగం కాలేదని విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. ‘‘అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయటంలో భారత అమెరికన్ల పాత్ర తిరుగులేనిది. మీరు ఒక దానికి విలువ కట్టాలని భావించినప్పుడు అందుకు మీ అర్హత ఏమిటన్న దానిపై దృష్టి పెట్టాలి.’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. భారత అమెరికా సంయుక్త ప్రకటనలో సైతం హెచ్1బి వీసాల అంశాన్ని పేర్కొనలేదు. వైట్‌హౌస్ విడుదల చేసిన ఒక ఫ్యాక్ట్‌షీట్‌లో భారత అమెరికన్లు నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణలో కీలక భాగస్వామ్యం పోషించారని పేర్కొంది. సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ విప్లవంలో భారతీయుల పాత్ర గొప్పదని తెలిపింది. సిలికాన్ వ్యాలీలోని స్టార్ట్ అప్‌లలో 15శాతం భారతీయులవేనని తెలిపింది. ‘పెంటియమ్ చిప్‌ను వారు అభివృద్ధి చేశారు. ఫైబర్ ఆప్టిక్స్, కాలుష్యం లేని స్వచ్ఛమైన ధ్వని కలిగిన హెడ్‌ఫోన్స్, ఇలా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశారు’’ అని వైట్‌హౌస్ ఫ్యాక్ట్ షీట్ వెల్లడించింది. అమెరికాలో దాదాపు 40లక్షల మంది భారతీయులు ఉండగా, భారత్‌లో ఏడు లక్షల మంది అమెరికన్లు ఉన్నారు. నిరుడు అమెరికా దాదాపు పది లక్షల వీసాలను భారతీయ పౌరులకు జారీ చేసిందని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. హెచ్1బి వీసాలపై వైట్ హౌస్ అధికారి ఒకరు స్పందిస్తూ ‘‘ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు చేసినప్పటికీ, వీసా దరఖాస్తులో కానీ, జారీ చేసే ప్రక్రియ వెంటనే మారదు, కాబట్టి ఈ పరిస్థితిలో అయితే ఎలాంటి మార్పులు జరగవు. అంతే కాకుండా ఒక దేశానికి సంబంధించి కానీ, ఒక రంగానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు’’ అని ఆ అధికారి చెప్పారు.

చిత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఇచ్చిన విందు సందర్భంగా
మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్