అంతర్జాతీయం

భారత్‌కు అత్యాధునిక బోయింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 29: సరకులు/మానవ (ఎయిర్ లిఫ్ట్) రవాణా చేసే అత్యాధునిక భారీ విమానం బోయింగ్ సి-17 జెట్‌ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ అమెరికా కాంగ్రెస్‌కు తన నిర్ణయాన్ని తెలియజేసింది. సరకులను మాత్రమే కాకుండా విపత్తు సమయాల్లో ప్రజలను కూడా పెద్దఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సి-17లో ఎన్నో ఆధునిక సౌకర్యాలున్నాయి. మిసైల్ హెచ్చరిక వ్యవస్థతోపాటు శత్రువులను పసిగట్టే అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఈ విమానంలో ఉన్నాయి. దీని ఖరీదు దాదాపు 366.2 మిలియన్ అమెరికా డాలర్లుగా పెంటగాన్ పేర్కొంది. ప్రకృతి సిద్ధ ప్రమాదాలు సంభవించే అవకాశాలున్న జోన్‌లో భారత్ ఉందని, భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి ప్రళయాలు సంభవిస్తే ఈ అత్యాధునిక సి-17 విమానం సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపింది. పెద్దఎత్తున సైనికులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా సి-17లో తరలించవచ్చని పేర్కొంది. సైనిక అవసరాలకే కాకుండా మానవతా దృక్పథంతో విపత్తు సమయాల్లో పెద్దఎత్తున పౌరులను తరలించడానికి వీలుకలుగుతుంది. ఈ విమానం 170,900 పౌండ్ల బరువుగల సరుకును రవాణా చేయగలుగుతుందని తెలిపింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కేవలం ముగ్గురు సిబ్బంది (పైలట్, కో-పైలట్, ఒక సిబ్బంది)తో ఈ విమానాన్ని నడపవచ్చని పేర్కొంది. భారత్ ఇప్పటికే సి-17 విమానాలను నడుపుతోందని, ఈ కొత్త విమానాన్ని ఉపయోగించడంలో ఆ దేశానికి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండబోవని తెలిపింది. సరకు రవాణాలో బోయింగ్ సి-17ఎ గ్లోబ్‌మాస్టర్-3 శ్రేణి విమానం ప్రపంచంలోనే అత్యాధునికమైంది.