అంతర్జాతీయం

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 29: కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద భారత దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయంటూ ఇక్కడి తాత్కాలిక డిప్యూటీ హైకమిషనర్‌ను కలిసి పాక్ తన నిరసన తెలిపింది. బుధవారం నికియల్ సెక్టార్‌లో భారత దళాల కాల్పుల్లో 22 ఏళ్ల పౌరుడు మృతి చెందాడు. డొతిల్లా గ్రామానికి చెందిన అబ్దుల్ వహాబ్ మృతి చెందాడని, మరో నలుగురు గాయపడ్డారని విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ మహ్మద్ ఫైజల్ భారత తాత్కాలిక డిప్యూటీ హైకమిషనర్ ఎస్ రఘురాంకు సమన్లు జారీ చేశారు. ఎల్‌ఓసి వద్ద చోటుచేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు భారత్ దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు.