అంతర్జాతీయం

వీసా వర్కర్ల జీతం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్ జూన్ 29: హెచ్-1బి వీసాలపై పని చేసే విదేశీ వర్కర్ల కనీస వేతనాన్ని ఇప్పుడున్న 60 వేల డాలర్లనుంచి కనీసం 80 వేల డాలర్లకు పెంచాలని అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా సూచించారు. భారతీయ ఐటి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ హెచ్-1బి వీసాలపైనే అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే. అమెరికా వర్కర్ల స్థానంలో హెచ్-1బి వీసాలపై అమెరికాకు వచ్చే విదేశీ వర్కర్లను నియమించుకునే సమస్యకు దీనివల్ల చాలావరకు పరిష్కారం లభిస్తుందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఓ కమిటీకి అకోస్టా చెప్పారు. ‘చాలాకాలంగా కాంగ్రెస్ ఆ 60 వేల డాలర్ల పరిమితిని పెంచలేదు. కేవలం ద్రవ్యోల్బణం దృష్ట్యా చూసినా ఈ మొత్తం 80 వేల డాలర్లకు పైగానే పెంచాల్సి ఉంటుంది. ఆ పని చేసినట్లయితే మీరు గుర్తించిన సమస్యల్లో చాలావాటికి అది పరిష్కారమవుతుంది. ఎందుకంటే చాలామంది ఆ 60 వేల డాలర్ల పరిమితికి దిగువనే ఉన్నారు’ అని అకోస్టా అమెరికా సెనేట్‌కు చెందిన కార్మిక, ఆరోగ్య, మానవ సేవలు, విద్య, సంబంధిత రంగాలకు సంబంధించిన ఉప సంఘం సభ్యులతో అన్నారు. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సెనేటర్ రిచర్డ్ డర్బిన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అకోస్టా ఈ విషయం చెప్పారు.
చికాగోలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న 150 మంది ఐటి వర్కర్లను తొలగించనున్నట్లు ఆ కంపెనీ చెప్పిన విషయాన్ని డర్బిన్ ప్రస్తావించారు. వీరంతా రెండు విషయాలకు అంగీకరించినట్లయితే పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా ఒక నెల వేతనం ఇస్తామని ఆ కంపెనీ వారికి చెప్పిందని ఆయన తెలిపారు. ఈ రెండు విషయాల్లో మొదటిది తమను ఉద్యోగాలనుంచి తొలగించినట్లు వారు బహిరంగంగా ఎక్కడా చెప్పకూడదనేది కాగా, రెండోది తమ స్థానంలో భారత్‌నుంచి హెచ్-1బి వీసాలపై వచ్చిన వర్కర్లకు వారు శిక్షణ ఇవ్వాలనేది అని డర్బిన్ చెప్పారు. కాగా, అనేక సంఘటనల్లో ఇలాగే జరుగుతూ ఉందని అకోస్టా అంటూ, పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అమెరికా కార్మికుడు అడిగే ప్రశ్నలకు ఎవరైనా ఏం సమాధానం చెప్పగలరో ఆలోచించాలని అన్నారు.