అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 30: అమెరికాలో వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం పాక్షికంగా అమలులోకి రావడంతో ఆ దేశంలో మళ్లీ నిరసనలు భగ్గు మంటున్నాయి. ప్రధానంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విధించిన ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల వద్ద వందలాది మంది లాయర్లు, మానవ హక్కుల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో, వాషింగ్టన్ తదితర నగరాల్లోని విమానాశ్రయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనకారుల్లో కొంత మంది అరబిక్ భాషలో రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని వలసల పట్ల, ప్రత్యేకించి ముస్లింల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను ముక్తకంఠంతో ఖండించారు. అంతేకాకుండా ట్రంప్ ‘పెద్ద ఫాసిస్టు’ అంటూ వారు నిప్పులు చెరిగారు. అయితే అమెరికాలోకి వలస వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రంప్ ఈ ఏడాది ఆరంభంలో తొలిసారి ప్రకటన చేసినప్పుడు ఎగసిపడిన నిరసన సెగలతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలు అంత తీవ్రమైన స్థాయిలో లేవు.