అంతర్జాతీయం

జాధవ్‌ను పౌరులతో పోల్చడం అవహేళనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 2: కుల్‌భూషణ్ జాధవ్‌ను ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న సామాన్య ఖైదీలతో భారత్ పోల్చడం అవహేళనే అవుతుందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్‌లో శిక్షణనుభవిస్తున్న ఆ దేశ సామాన్య పౌరుల జాబితాలో జాధవ్‌ను చేర్చడం భారత్ ఈ కేసును నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని విదేశాంగ కార్యాలయం విమర్శించింది. కమాండ్ జాధవ్ భారత నావికా దళంలో అధికారిగా పనిచేస్తున్నాడని, మా దేశంపై గూఢచర్యం చేయడానికి ఆ దేశం పంపిందని పేర్కొంది. అతను చేసిన విధ్వంస చర్యల కారణంగా పాక్‌లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపించింది. అతనిని భారత్ సాధారణ ఖైదీగా పేర్కొని న్యాయ సహాయం అందించాలని కోరడంలో అర్థం లేదని పేర్కొంది. 2008 ఒప్పందానికి కట్టుబడి ఇక్కడ శిక్ష పూర్తి చేసుకున్న ఐదుగురు ఖైదీలను జూన్ 22న భారత్‌కు అప్పజెప్పామని తెలిపింది. భారత్ మాత్రం ఆ పని చేయలేదని ఆరోపించింది.