అంతర్జాతీయం

భారత్‌తో సంబంధాల పెంపునకు అమెరికా పార్లమెంట్ తహతహ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 2: భారత్‌తో వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు అమెరికా పార్లమెంట్ ఎంతో సానుకూలంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించడానికి ముందు ఆ దేశ చట్టసభల సభ్యులకోసం సిఆర్‌ఎస్ (కాంగ్రెసనల్ రీసెర్చ్ సర్వీస్) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారత్-అమెరికా సంబంధాల్లోని ప్రధాన కోణాలను కూలంకషంగా సమీక్షించి ఈ నివేదికను రూపొందించింది. కొన్ని విషయాల్లో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ భారత్‌తో వ్యూహాత్మక, వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా పార్లమెంట్ సుముఖంగా ఉందని 43 పేజీలతో రూపొందించిన ఈ నివేదికలో సిఆర్‌ఎస్ పేర్కొంది.