అంతర్జాతీయం

ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూలై 4: పొరుగు దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. అమెరికా, జపాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మంగళవారం మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరిపింది. కాగా, ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమయిందని, అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణి ప్రపంచంలోనే ఏ ప్రాంతాన్నయినా ధ్వంసం చేయగలదని ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ప్రకటించింది. అమెరికా తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న రోజునే ఈ క్షిపణి పరీక్ష జరపడంద్వారా ఉత్తర కొరియా పరోక్షంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సవాలు విసిరినట్లయింది. ఉత్తర ఫోంగాన్ రాష్ట్రంలోని ఫాంగ్యోన్ సమీపంలో ఉన్న క్షిపణి పరీక్షా కేంద్రంనుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణ కొరియా ధ్రువీకరించాయి. ఈ క్షిపణి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి జపాన్ సముద్రంలో కూలిపోయినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్ట్ఫా ఒక ప్రకటనలో తెలిపారు. జపాన్‌కు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో ఈ క్షిపణి పడినట్లుగా ఉందని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎఎఫ్‌పి వార్తాసంస్థకు తెలిపారు. ఈ క్షిపణి మామూలు క్షిపణులకన్నా ఎక్కువగా దాదాపు 40 నిమిషాలపాటు ప్రయాణించిందని ఆయన చెప్పారు. అయితే ఈ బాలిస్టిక్ క్షిపణి ఉత్తర కొరియా చాలాకాలంగా ఆశిస్తున్నట్లుగా ఖండాంతర క్షిపణి అవునా కాదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై మండిపడిన జపాన్ దీన్ని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించింది.
క్షిపణి ప్రయోగం జరిగిన వెంటనే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయే- ఇన్ జాతీయ భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై అత్యవసర చర్చలు జరిపారు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన మూన్ గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తొలిసారిగా జరిపిన సమావేశంలో ఉత్తర కొరియానుంచి ఎదురవుతున్న ముప్పుగురించే ప్రధానంగా చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తర కొరియా చర్యలతో సహనం పూర్తిగా చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు కూడా. మూన్‌తో సమావేశం అనంతరం ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, జపాన్ ప్రధాని షింజే అబేలకు ఫోన్ చేసి ఇదే అంశంపై చర్చించారు.
మండిపడిన ట్రంప్
ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షపై ట్రంప్ ట్విట్టర్‌లో తీవ్రంగా మండిపడుతూ, ‘మానవ జీవితాలతో ఆడుకోవడం తప్ప ఉత్తర కొరియా నేత కిమ్‌కు మరో విషయం తెలియదా?’ అని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. ఈ నానె్సస్‌ను శాశ్వతంగా ఆపడానికి చైనా ఏదయినా గట్టిచర్య తీసుకుంటుందేమో చూడాలని కూడా ట్రంప్ ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. మరోవైపు ఉత్తర కొరియా మంగళవారం ప్రయోగించిన బాలిస్టక్ క్షిపణి ఖండాంతర క్షిపణి అయి ఉండవచ్చని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం అభిప్రాయపడ్డారు. క్షిపణి ప్రయాణించిన సమయం, దూరంపై అమెరికా పసిఫిక్ కమాండ్ నివేదిక నిజమైన పక్షంలో అది ఖండాంతర క్షిపణి అయి ఉండవచ్చని, దాని గరిష్ఠ రేంజి 6,700 కిలోమీటర్లు అయి ఉండవచ్చని యూనియన్ ఆఫ్ కన్సర్డ్ సైంటిస్ట్స్ సంస్థలో అంతర్జాతీయ సెక్యూరిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన డేవిడ్ రైట్ అభిప్రాయపడ్డారు.

చిత్రాలు.. క్షిపణి ప్రయోగాన్ని వీక్షిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్