అంతర్జాతీయం

గర్జించిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూలై 8: కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాపై అమెరికా శనివారం తీవ్రస్థాయిలో గర్జించింది. తమ యుద్ధ విమానాలతో శనివారం దక్షిణ కొరియాలో లైవ్ ఫైర్ డ్రిల్ నిర్వహించి ఉత్తర కొరియాకు బలమైన హెచ్చరిక పంపింది. అమెరికా ఇటువంటి విన్యాసాలను నిర్వహించడం చాలా అరుదు. ఉత్తర కొరియా తాజాగా నిర్వహించిన ఖండాంతర క్షిపణి పరీక్షకు దీటుగా జవాబివ్వాలన్న లక్ష్యంతో అమెరికా యుద్ధ విమానాలు డిఎంజడ్ (డీ మిలటరైజ్డ్ జోన్)కు అత్యంత సమీపంగా ఎగురుతూ ఈ విన్యాసాలను నిర్వహించాయని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గువామ్‌లోని ఆడర్సన్ వైమానిక స్థావరంలో అమెరికా మోహరించిన బి-1బి లాన్సర్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని, ఆ తర్వాత అవి తమ స్థావరానికి తిరిగి వెళ్లడానికి ముందు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే ఉత్తర, దక్షిణ కొరియా దేశాల భౌగోళిక సరిహద్దుకు అత్యంత సమీపంలో చక్కర్లు కొట్టాయని ‘యొన్హాప్’ వార్తా సంస్థ వెల్లడించింది. వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాను గట్టిగా హెచ్చరించాలన్న లక్ష్యంతోనే ఈ విన్యాసాలను నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైనికదళం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ విన్యాసాల్లో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ విమానాలతోపాటు దక్షిణ కొరియా యుద్ధ విమానాలు కూడా పాలు పంచుకున్నాయి. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల భౌగోళిక సరిహద్దుకు దాదాపు 80 కిలోమీటర్ల (50 మైళ్ల) దూరంలోని ఇయోంగ్వోల్ కౌంటీలో ఈ విన్యాసాలు జరిగాయని, ఈ విన్యాసాల్లో అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు బంకర్లను ధ్వంసం చేసేందుకు ఉపయోగించే 2000 వేల పౌండ్ల (907.1 కిలోల) బరువైన భారీ లేజర్ గైడెడ్ స్మార్ట్ బాంబులను జార విడిచాయని, మరో రెండు యుద్ధ విమానాలు శత్రువుల క్షిపణి వ్యవస్థలను ఏవిధంగా ధ్వంసం చేయాలనే విషయాన్ని ప్రదర్శించాయని దక్షిణ కొరియా సైనికదళం తెలిపింది.