అంతర్జాతీయం

26/11 దాడి కేసులో పాక్ ఉగ్రవాదికి బెయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 13: దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కుదిపేసిన 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది సుఫయాన్ జాఫర్‌ను తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు బెయిలుపై విడుదల చేసినట్లు కోర్టు అధికారి ఒకరు గురువారం తెలిపారు. ఈ కేసు లో ప్రధాన నిందితుడు లష్కరే తోయి బా ఆపరేషన్స్ కమాండర్ జకీవుర్ రెహమాన్ ఇప్పటికే 2015 ఏప్రిల్‌నుంచి బెయిలుపై ఉన్న విషయం తెలిసిందే. 26/11నాటి దాడిలో సంబంధం ఉంద న్న ఆరోపణపై గత ఏడాది అరెస్టు చేసిన లష్కరే తోయిబా మాజీ మిలిటెంట్ సుఫయాన్ జాఫర్‌ను బెయిలుపై విడుదల చేయడం జరిగింది. దర్యాప్తు సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి
సాక్ష్యాధారాలు లభించనందున రావల్పిండిలోని అదియాలా జైలులో విచారణ జరిపిన యాంటీ టెర్రరిస్టు కోర్టు ఆయనను బెయిలుపై విడుదల చేసిందని ఆ కోర్టు అధికారి చెప్పారు. దర్యాప్తు సమయంలో జాఫర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, అందువల్ల ఆయనకు ఈ కేసుతో సంబంధం ఉన్న విషయం నిర్ధారణ కాలేదని విచారణ సందర్భంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజన్సీ (ఎఫ్‌ఐఏ) కోర్టుకు తెలిపినట్లు ఆ అధికారి తెలిపారు.
ముంబయి ఉగ్రవాద దాడులకు ముందు మరో నిందితుడు షాహిద్ జమీల్ రియాజ్‌కు 39.8 లక్షల రూపాయల నిధులు సమకూర్చాడన్నది జాఫర్‌పై ఉన్న ఆభియోగం. అలాగే ఈ కేసులో మరో నిందితుడయిన తన సోదరుడి బ్యాంక్ ఖాతాలో 14,800 రూపాయలు డిపాజిట్ చేశాడనేది మరో అభియోగం. 2009లో ముంబయి దాడి కేసులో జాఫర్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించారు. కాగా, గత ఏడాది ఆగస్టులో కైబర్-్ఫక్తూన్‌క్వా రాష్ట్రంలోని రహస్య స్థావరంలో ఆయనను అరెస్టు చేశారు.