అంతర్జాతీయం

ట్రంప్‌పై అభిశంసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 13: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యుడు బ్రాడ్ షెర్‌మాన్ అభిశంసన తీర్మానాన్ని ప్రేవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి తొలి అడుగు వేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న విచారణకు భంగం కలిగించే రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న షెర్‌మాన్ ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరో సభ్యుడు అల్ గ్రీన్ ఈ తీర్మాన ప్రతిపై సంతకం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ నేతృత్వంలో ఎన్నికల్లో రష్యా జోక్యంపై చేస్తున్న విచారణకు అంతరాయం కలిగించేలా ట్రంప్ వ్యవహరించారని షెర్‌మాన్ ఆరోపించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) డైరెక్టర్ జేమ్స్ కామేను బాధ్యతల నుంచి తొలగించడం చట్టపరంగా సాగుతున్న విచారణకు అడ్డుతగలడమే అవుతుందని ఆయన అన్నారు. అధ్యక్ష పదివి ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా ప్రవరించడం, భావోద్వేగాలపై నియంత్రణ లేని ట్రంప్ వ్యవహార శైలి దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ఆయన విమర్శించారు. అయితే కేవలం కుటిల రాజకీయంతో ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారని శే్వత సౌధ అధికార ప్రతినిధి సరా హుకాబీ శాండర్స్ పేర్కొన్నారు.
ఇలావుండగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధించి ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా సంతోషించేవారని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఎందుకంటే హిల్లరీ అధ్యక్షురాలైతే దేశం బలహీనపడిపోయేదని, పుతిన్‌కు కావాల్సింది కూడా అదేనని ఆయన అన్నారు. క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విధంగా పేర్కొన్నారు. హిల్లరీ విజయం సాధించి ఉంటే సైనిక బలం బాగా తగ్గిపోయేదని అందుకే పుతిన్ క్లింటన్ గెలవాలని కోరుకున్నారని ట్రంప్ అన్నారు. పుతిన్ కోరుకుంటున్న విధానాలకు తాను పూర్తి విరుద్ధమని అన్నారు. సిబిఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇంకా ఆ చానల్ టెలికాస్ట్ చేయలేదు.

చిత్రం.. మేరీలాండ్ నుంచి ప్యారిస్‌కు బయలుదేరిన ట్రంప్, ఆయన భార్య మెలానియా