అంతర్జాతీయం

చర్చించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 22: డోక్లామ్‌లో సైనిక ప్రతిష్ఠంభన విషయమై నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనా నేరుగా చర్చలు జరపాలని అమెరికా సూచించింది. టిబెట్ దక్షిణాదిలోని ఈ వివాదాస్పద ప్రాంతంలో రోడ్డును నిర్మిస్తున్న చైనా సైనిక బలగాలను భారత దళాలు అడ్డుకోవడంతో గత నెల రోజుల నుంచి ఇరు పక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇది తమ ప్రాంతమని భారత మిత్రదేశమైన భూటాన్ కూడా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించుకుని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు నేరుగా చర్చలు జరపాల్సిందిగా భారత్, చైనాకు సూచిస్తున్నామని పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయ) అధికార ప్రతినిధి గ్రే రాస్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ప్రస్తుతం భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతోందా? అని ప్రశ్నించగా, దీనిపై మరింత సమాచారంకోసం భారత్, చైనా ప్రభుత్వాలనే సంప్రదించాలని, అంతేతప్ప ఇటువంటి అంశాలపై తాము ఊహాగానాలు చేయలేమని స్పష్టం చేశారు.
భారత్, చైనాకు గత వారం అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇదేవిధమైన సూచనలు చేసింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునే విషయంలో చైనా గత కొన్ని సంవత్సరాల నుంచి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని, డోక్లామ్‌లో ఏర్పడిన సైనిక ప్రతిష్ఠంభన కూడా ఆ ప్రాంతంలో యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే కనిపిస్తోందని దాదాపు అన్ని ఇరుగు పొరుగు దేశాలు నిందిస్తున్నాయి. దీంతో చైనా ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా భారత్ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చేవారం బీజింగ్‌కు వెళ్లనున్న మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ప్రతిష్ఠంభన గురించి చైనా జాతీయ భద్రతా సలహాదారు యాంగ్ జియెచీతో చర్చించే అవకాశం ఉంది.