అంతర్జాతీయం

భారత్‌కు మిగ్-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జుకోవ్‌స్కీ (రష్యా), జూలై 23: నాలుగో తరానికి చెందిన అత్యాధునిక మిగ్-35 యుద్ధ విమానాలను భారత్‌కు అమ్మేందుకు రష్యా ఎదురు చూస్తోంది. ఈ విమానాల కొనుగోలుకు భారత్ ఆసక్తి చూపుతోందని, ఈ విషయంలో భారత్ అవసరాలు ఏమిటో తెలుసుకునేందుకు చర్చలు సాగుతున్నాయని మిగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఇల్యా తరసెంకో వెల్లడించారు. ఎంఎకెఎస్-2017 ఎయిర్ షో సందర్భంగా ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, మిగ్-35 ‘ఉత్తమ’ యుద్ధ విమానమని, అమెరికా సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన ఐదోతరం యుద్ధ విమానం ఎఫ్-35 కంటే ఇది ఎంతో మెరుగైనదని, గగనతల పోరాట పటిమ విషయంలో మిగ్-35 ముందు ఎఫ్-35 ఏమాత్రం నిలువజాలదని స్పష్టం చేశారు. భారత్‌తోపాటు మరికొన్ని ఇతర దేశాలకు మిగ్-35 విమానాలను అమ్మేందుకు తమ సంస్థ విస్తృత ప్రయత్నాలు చేస్తోందన్నారు. భారత్‌కు ఈ విమానాలను సరఫరా చేసేందుకు ఎదురు చూస్తున్నామని, ఇందుకు సంబంధించిన టెండర్‌ను గెలుచుకునేందుకు భారత వైమానిక దళంతో చర్చలు సాగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విమానాల కొనుగోలుకు భారత్ ఆసక్తి చూపుతోందా? అని విలేఖరులు ప్రశ్నించగా, అవునని ఆయన సమాధానమిచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి రష్యాకు మిత్రదేశంగా కొనసాగుతున్న భారత్ దాదాపు ఐదు దశాబ్దాల నుంచి మిగ్ విమానాలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ కొత్త ఉత్పత్తులను అన్ని మిత్ర దేశాల కంటే ముందుగా భారత్‌కు సరఫరా చేయాలని మిగ్ కార్పొరేషన్ యోచిస్తోందని తరసెంకో తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉందని, భారత్‌కు తాము సరఫరా చేయదల్చుకున్న మిగ్-35 యుద్ధ విమానాల శక్తి సామర్ధ్యాలు, వాటి సాంకేతిక అంశాలపై ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మిగ్-35 చాలా కొత్త యుద్ధ విమానమని, కనుక భారత్ అవసరాలు ఏమిటో తెలుసుకుని అందుకు అనుగుణంగా ఈ విమానాలను తీర్చిదిద్దేందుకు మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. భారత్‌కు మిగ్-35 విమానాల అమ్మకంతోపాటు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా ఆఫర్ చేస్తున్నామని, ఆ విధంగా చూసుకుంటే ఈ విమానాలు ఎంతో చౌకైనవని తరసెంకో తెలిపారు. ‘్భరత్‌కు కేవలం మిగ్-35 విమానాలను సరఫరా చేయడమే కాకుండా ఈ విమానాలను ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చేందుకు, 40ఏళ్ల పాటు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను అందించేందుకు కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. ఆ విధంగా చూసుకుంటే మిగ్-35 విమానాలు ఇతర పోటీదారులు ఆఫర్ చేస్తున్న ధర కంటే 20 నుంచి 25 శాతం తక్కువ ధరకే లభిస్తాయి’ అని పేర్కొన్నారు.

చిత్రం.. భారత్‌కు సరఫరా చేయనున్న మిగ్-35 విమానం