అంతర్జాతీయం

తొలగని సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 27: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి పనామా పత్రాలు చేసిన ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును ఆగస్టు 15లోపు ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. రాబోయే రెండు వారాలకు సంబంధించి కోర్టు గురువారం కేసుల రోస్టర్‌ను ప్రకటించడంతో ఈ అంశం స్పష్టమైంది. ఈ జాబితా ప్రకారం సుప్రీంకోర్టు ఆగస్టు 11 దాకా కేసులను విచారించే బెంచ్‌లను ప్రకటించింది. ఈ బెంచ్‌లలో పనామా పత్రాల కేసులో విచారణ మగిసిన తర్వాత గత వారం తీర్పును వాయిదా వేసిన త్రిసభ్య ధర్మాసనం లేదు. పనామా కేసు అమలు కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనంలోని ఇద్దరు జడ్జీలు వచ్చే వారంనుంచి ఆగస్టు 11 వరకు ఇస్లామాబాద్‌లో ఉండడం లేదని రోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. బెంచ్‌లోని జస్టిస్ షేక్ అజ్మత్ సరుూద్ సుప్రీంకోర్టు లాహోర్ రిజిస్ట్రీలోని కేసులను విచారించనుండగా మరో జడ్జి జస్టిస్ ఇజాజుల్ అహ్సన్ సెలవుపై వెళ్తున్నారు. బెంచ్‌కి నేతృత్వం వహిస్తున్న ఎజాజ్ అఫ్జల్ ఖాన్ మాత్రమే ఇస్లామాబాద్‌లో అందుబాటులో ఉంటారు. కాగా, ఆగస్టు 12నుంచి 14 దాకా వారాంతపు సెలవుల కారణంగా కోర్టు ఉండదు. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా ఆ మర్నాడు కూడా కోర్టుకు సెలవు. షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి) ఈ నెల 10న కోర్టుకు తన నివేదికను సమర్పించింది. ఈ కేసులో విచారణను ఈ నెల 21న ముగించిన కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. అవినీతికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించినట్లయితే షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పదు. ఈ తీర్పుపై అన్ని పార్టీలు ముఖ్యంగా ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పార్టీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి.